Munugodu ఘనంగా పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి 9వ వర్ధంతి
Munugodu ఘనంగా పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి 9వ వర్ధంతి
నివాళులర్పించిన బీఆర్‌ఎస్ నాయకులు
మునుగోడు(Munugodu), ఆంధ్రప్రభ:
మాజీ రాజ్యసభ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి 9వ వర్ధంతి సందర్భంగా మంగళవారం చండూరు మున్సిపాలిటీ కేంద్రంలోని ఆయన విగ్రహానికి మునుగోడు బీఆర్‌ఎస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ప్రజా సేవకు అంకితభావంతో పనిచేసిన నాయకుడని కొనియాడారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.
రాజకీయాల్లో విలువలు, ప్రజల పట్ల నిబద్ధతతో వ్యవహరించిన ఆయన ఆశయాలను నేటి తరం నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ప్రజల సంక్షేమం, సమాజాభివృద్ధి కోసం ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు మారగోని అంజయ్య గౌడ్, మేకల శ్రీనివాస్‌రెడ్డి, జిట్టగోని మల్లేష్, గురిజ సునిల్, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
