నెన్నెల మండల సమాఖ్యకు బస్సు మంజూరు

నెన్నెల మండల సమాఖ్యకు బస్సు మంజూరు

నెన్నెల, ఆంధ్రప్రభ:
నెన్నెల మండల సమాఖ్యకు రాష్ట్ర ప్రభుత్వం బస్సును మంజూరు చేసింది. ఈ బస్సును రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించే కార్యక్రమంలో ప్రారంభించనున్నారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు నెన్నెల మండల సమాఖ్య సభ్యులు మంగళవారం మండల కేంద్రం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు.

మండల సమాఖ్యకు బస్సు మంజూరు కావడంతో సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ బస్సు ద్వారా సమాఖ్య కార్యకలాపాలు మరింత సులభతరం అవుతాయని వారు పేర్కొన్నారు.

Leave a Reply