4-rajya-sabha-candidates : ఆ నలుగురూ ఏకగ్రీవం Andhra Prabha Top News

4-rajya-sabha-candidates : ఆ నలుగురూ ఏకగ్రీవం Andhra Prabha Top News

  • నామినేఫన్లు ఓకే
  • పోటీ లేని విజయం
  • ఇక ప్రకటనే ఆలస్యం

(ఆంధ్రప్రభ, న్యూస్​ నెట్​ వర్క్​ )

4-rajya-sabha-candidates : రాజ్యసభ ఎంపి ఎన్నికల్లో నలుగురు అభ్యర్ధులు దాఖలు చేసిన నామినేషన్లు సక్రమంగా ఉండడంతో ఆమోదించినట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్.వణితా రాణి వెల్లడించారు. మంగళవారం అసెంబ్లీ కమిటీ హాల్లో రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన జరిగింది. రాజ్యసభ ఎంపి అభ్యర్ధులుగా తెలుగుదేశం పార్టీ తరుపున చింతకాయల విజయ్,బాష్యం రామకృష్ణ,సానా సతీష్,జనసేన పార్టీ తరపున లింగమనేని రమేష్ లు దాఖలు చేసిన నామినేష్లను సమక్రమంగా ఉండడంతో పరిశీలన అనంతరం నలుగురు అభ్యర్దుల నామినేషన్లను ఆమోదించినట్టు ఆమె వెల్లడించారు. నాలుగు రాజ్యసభ స్థానాలకు నలుగురు అభ్యర్ధులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడంతో వారంతా ఏకగ్రీవంగా ఎన్నికవుతారు.ఈనామినేషన్ల పరిశీలనలో ఆయా అభ్యర్థుల తరుపున పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply