గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ఘన స్వాగతం
గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ఘన స్వాగతం
రేణిగుంట, ఆంధ్రప్రభ : తిరుపతి జిల్లా మూడు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు జిల్లా యంత్రాంగం ఘన స్వాగతం పలికింది. విమానాశ్రయంలో కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు, శ్రీకాళహస్తి ఆర్డీవో భాను ప్రకాశ్ రెడ్డి తదితరులు గవర్నర్‌కు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు, విమానాశ్రయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
