Nara-Lokesh-Assures : అండగా ఉంటాం Andhra Prabha Top News

Nara-Lokesh-Assures : అండగా ఉంటాం Andhra Prabha Top News

  • అందుకే వచ్చాం
  • దైర్యంగా ఉండండి
  • జీవితాంతం మీ వెంటే
  • భవిష్యత్తులో ఇలాంటివి జరగనీయం
  • నివదిక రాగానే చర్య తీసుకుంటాం
  • విశాఖ స్టీల్​ ప్లాంట్​ ప్రమాద బాధితులకు మంత్రి లోకేష్​ భరోసా

( ఆంధ్రప్రభ, విశాఖపట్నం బ్యూరో )

Nara-Lokesh-Assures

Nara-Lokesh-Assures : ధైర్యంగా ఉండండి. ప్రభుత్వ పరంగా అన్ని విధాల అండగా ఉంటాం. బాధిత కుటుంబాలకు అండగా నిలబడేందుకు వచ్చా. కేంద్రంలోని ఎన్డీయే, రాష్ట్రంలోని ఎన్డీయే, ఉప ముఖ్యమంత్రి సహా తరలి వచ్చాం, బాధిత కుటుంబాలకు జీవితాంతం అండగా ఉంటాం . అందరం కలిసి పోరాడటం వల్లే స్టీల్ ప్లాంట్ ను కాపాడుకున్నాం, అని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్
అన్నారు.

Nara-Lokesh-Assures

ఈ ప్రమాదంపై కమిటీ నివేదిక వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటాం అని మంత్రి లోకేష్​ స్పష్టం చేశారు. తొలుత విశాఖ కేజీహెచ్ కు మంత్రి లోకేష్ వచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. కేంద్ర ఉక్కు శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి సంధ్యారాణి, ఎంపీ శ్రీ భరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, చింతకాయల విజయ్ తదితరులు మంత్రి లోకేష్​ వెంట ఉన్నారు. స్లీల్​ ప్లాంట్​ లో ప్రమాదం జరిగిన తీరును ఆయన అడిగి తెలుసుకున్నారు.

Nara-Lokesh-Assures : క్షతగాత్రులకు దైర్యం

Nara-Lokesh-Assures

స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఐసీయూలో చికిత్స పొందుతున్న సూరిబాబు, పైడిరాజు, పి.శ్రీనివాసరావు సహా క్షతగాత్రులను మంత్రి లోకేష్, కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, హోంమంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని, ఆసుపత్రిలో అందుతున్న చికిత్సను వైద్యులను మంత్రి లోకేష్​ అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్షతగాత్రుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.

Nara-Lokesh-Assures

స్టీల్ ప్లాంట్ లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడి కిమ్స్ లో చికిత్స పొందుతున్న ఆర్.మల్లికార్జునరావు, గుడివాడ అర్జున అప్పారావు, బి.సత్యానందను పరామర్శించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని వైద్యులను ఆదేశించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరపున అన్ని విధాల అండగా ఉంటామని బాధితులకు భరోసా ఇచ్చారు.

Nara-Lokesh-Assures
Nara-Lokesh-Assures
Nara-Lokesh-Assures
Nara-Lokesh-Assures
Nara-Lokesh-Assures

ALSO READ : 3-Member-Committee : రంగంలోకి కేంద్ర​ కమిటీ Andhra Prabha Spl News

Leave a Reply