Dhootha Season 2 | నాగచైతన్యతో మరోసారి!

Dhootha Season 2 | నాగచైతన్యతో మరోసారి!

Dhootha Season 2 | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: అక్కినేని నాగచైతన్య నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘దూత’ అమెజాన్ ప్రైమ్‌లో సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఫ్యాన్స్ ఈ సిరీస్ సీజన్ 2 కోసం ఎంతగానో వేచి చూస్తున్నారు. ఇటీవలే ఈ సీజన్ 2 కి సంబంధించిన పనులు కూడా ప్రారంభమయ్యాయి. అంతేకాకుండా, ఈ సీజన్‌కు నాగచైతన్య స్వయంగా సహ నిర్మాతగా వ్యవహరిస్తుండటంతో.. ఆయన నిర్మాతగా మారినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే, ఇప్పుడు ‘దూత’ సీజన్ 2 నుంచి ఒక సరికొత్త క్రేజీ అప్‌డేట్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ ప్రాజెక్ట్‌లోకి తాజాగా ఓ సీనియర్ హీరోయిన్ ఎంట్రీ ఇచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ‘సవ్యసాచి’ సినిమా తర్వాత నాగచైతన్యతో కలిసి ఆమె మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే…

విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘దూత’ మొదటి సీజన్ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై ఎంతటి భారీ విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే. ప్రెస్ క్లిప్పింగ్స్ ద్వారా భవిష్యత్తులో జరగబోయే ప్రమాదాలను ముందే ఊహించే ఒక జర్నలిస్ట్ (సాగర్) పాత్రలో నాగచైతన్య నటనకు, అలాగే విక్రమ్ కుమార్ స్క్రీన్‌ప్లేకి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

అయితే, ఇప్పుడు రాబోయే 2వ సీజన్‌లో సీనియర్ నటి భూమికా చావ్లా ఈ సిరీస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సరికొత్త సీజన్‌పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. మొదటి సీజన్ ఆసక్తికరమైన సస్పెన్స్ నోట్‌తో ముగియడంతో.. సీజన్ 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందులో భూమిక ఎంట్రీ ఇవ్వడం కథకు మరింత బలాన్ని చేకూరుస్తుందని ఇండస్ట్రీ టాక్. ఆమె పాత్ర కథను మలుపు తిప్పే ఒక కీలకమైన క్యారెక్టర్ అని తెలుస్తోంది. ఇది కూడా మొదటి సీజన్ లాగే విలక్షణమైన సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్ ఎలిమెంట్స్‌తో సాగనుంది.

ఈ సీజన్‌కు కూడా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించనుండగా.. శరత్ మరార్ (నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్) నిర్మిస్తున్నారు. ఈ సిరీస్ కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలోనే స్ట్రీమింగ్ కానుంది. భూమిక లాంటి సీనియర్, టాలెంటెడ్ నటి తోడవడంతో ‘దూత 2’ పై హైప్ మరింత పెరిగింది.

CLICK HERE TO READ Peddi | ‘పెద్ది’ పై ఐకాన్ స్టార్ సెన్సేషనల్ కామెంట్స్!

CLICK HERE TO READ MORE

Leave a Reply