Road Accident | ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి

Road Accident | ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి

Road Accident | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌: మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అమల్నేర్ సమీపంలోని లోంధే ఫాటా వద్ద వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ముందుగా బైక్‌ను, అనంతరం బస్సును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్ నుంచి నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యేందుకు కారులో బయలుదేరిన ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు ఈ ప్రమాదానికి గురయ్యారు. కారు అత్యంత వేగంగా ప్రయాణిస్తుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం సంభవించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా ధ్వంసమవగా, మృతదేహాలు వాహనంలోనే చిక్కుకుపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వ్యక్తిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల పూర్తి కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply