ఇచ్చోడ పట్టణ అభివృద్ధి బాధ్యత నాది: ఎమ్మెల్యే

ఇచ్చోడ పట్టణ అభివృద్ధి బాధ్యత నాది: ఎమ్మెల్యే

రూ.50 లక్షల సీడీ వర్కులకు భూమిపూజ

ఇచ్చోడ, జూన్ 9, ఆంధ్రప్రభ: ఇచ్చోడ మండల కేంద్రంలోని పలు వార్డుల్లో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా చేపట్టనున్న సీడీ వర్కులకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మంగళవారం భూమిపూజ చేశారు.

వార్డులు 5, 6, 7లో రూ.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. అన్ని వార్డులతో పాటు మండల కేంద్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే బాధ్యత తనదని అన్నారు.

ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటిస్తూ, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొడప జెలై జాకు, ఉప సర్పంచ్ లోక శిరీష్‌రెడ్డి, మాజీ ఎంపీపీ ప్రీతమ్‌రెడ్డి, మండల కన్వీనర్ కృష్ణారెడ్డి, వార్డు సభ్యులు సాబీర్, సాజిద్, సమీఉల్లా, నాయకులు పాండు, గాడ్గే సుభాష్, మహేందర్‌రెడ్డి, ప్రవీణ్, మహేష్, నాగోరావ్, రాథోడ్ రమేష్, సచిన్, విష్ణు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply