బీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలి
బీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలి
సమన్వయకర్తల సమావేశంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పిలుపు
సంగారెడ్డి ప్రతినిధి, జూన్ 9, ఆంధ్రప్రభ: సంగారెడ్డి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పిలుపునిచ్చారు. మంగళవారం నాలుగు మండలాలు, రెండు మున్సిపాలిటీల సమన్వయకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించిన పార్టీ సభ్యత్వ నమోదు నియోజకవర్గ ఇన్‌చార్జి చంద్రగౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సభ్యత్వ నమోదు ఇన్‌చార్జి చంద్రగౌడ్‌ను శాలువాతో సన్మానించారు. అనంతరం సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించిన కార్యాచరణపై సమన్వయకర్తలతో విస్తృతంగా చర్చించి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. తప్పుడు హామీలు, అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను గడపగడపకు తీసుకెళ్తూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
పార్టీ సభ్యత్వ నమోదు నియోజకవర్గ ఇన్‌చార్జి చంద్రగౌడ్ మాట్లాడుతూ.. సమన్వయంతో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈసారి డిజిటల్ విధానంలో సభ్యత్వ నమోదు చేపడుతున్నామని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ రాష్ట్రంలో అత్యధిక సభ్యత్వాలు నమోదు చేసి పార్టీ బలాన్ని చాటాలని సూచించారు.
ఈ సమావేశంలో సంగారెడ్డి పట్టణ సమన్వయకర్తలు హకీం, వెంకటేశ్వర్లు, విజేందర్‌రెడ్డి, డాక్టర్ శ్రీహరి యాదవ్, సంగారెడ్డి మండల సమన్వయకర్త చక్రపాణి, కంది మండల సమన్వయకర్తలు మధుసూదన్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, కొండాపూర్ సమన్వయకర్త విఠల్, సదాశివపేట పట్టణ సమన్వయకర్తలు చీల మల్లన్న, కోడూరు రమేష్, సదాశివపేట మండల సమన్వయకర్త ఆంజనేయులు తదితరులతో పాటు సభ్యులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, సీడీసీ మాజీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మాజీ జడ్పీటీసీ మనోహర్‌గౌడ్, సుధీర్‌రెడ్డి, మల్లా గౌడ్ తదితర నాయకులు పాల్గొన్నారు.
