20వ వార్డులో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు
20వ వార్డులో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు
మధిర, ఆంధ్రప్రభ: మధిర మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డులో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు చేపడుతున్నట్లు ఆ వార్డు కౌన్సిలర్ బొల్లెద్దు విజయ కుమారి తెలిపారు.
మంగళవారం వార్డులో వలస కూలీలతో స్పెషల్ డ్రైవ్ కింద డ్రైనేజీల్లో పూడుకుపోయిన మురుగును తొలగించారు. వర్షాకాలంలో మురుగు నిల్వ ఉండకుండా, డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్తను తొలగిస్తున్నట్లు కౌన్సిలర్ విజయ కుమారి తెలిపారు.
వార్డులో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు కూడా పరిసరాల పరిశుభ్రతకు సహకరించాలని ఆమె కోరారు.
