శ్రీవారి సన్నిధిలో ఎమ్మెల్యే

శ్రీవారి సన్నిధిలో ఎమ్మెల్యే

సీఎం ఆరోగ్యం కోసం ప్రార్థన

కొత్తచెరువు, ఆంధ్రప్రభ: పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మంగళవారం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీఐపీ బ్రేక్ దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, సుభిక్షంగా జీవించాలని ప్రార్థించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో దీర్ఘకాలం ప్రజలకు సేవ చేస్తూ, రాష్ట్ర అభివృద్ధికి నాయకత్వం వహించాలని శ్రీవారిని వేడుకున్నట్లు తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి, దేశంలో ఆదర్శ రాష్ట్రంగా నిలవాలని ఆకాంక్షించారు.

పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలపై శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ప్రజల ఆశయాలు, ఆకాంక్షలు నెరవేరాలని ప్రత్యేకంగా ప్రార్థించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. నియోజకవర్గంలో శాంతి, సౌభాగ్యం, అభివృద్ధి వెల్లివిరియాలని, ప్రతి కుటుంబం ఆనందంగా జీవించాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు.

అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు వేద ఆశీర్వచనం అందించి, శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Leave a Reply