పిడుగు పడి పూరిల్లు దగ్ధం..
పిడుగు పడి పూరిల్లు దగ్ధం..
- తప్పిన ప్రాణాపాయం,
- ఐదు లక్షల ఆస్థి నష్టం
చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని జడల్ పేట శివారుగాంధీనగర్ లో ఉరుములు మెరుపులతో భారీ వర్షంతో, పిడుగు పడి పూరిల్లు పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లో ఎవరు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. దీంతో రూ5 లక్షల ఆస్థి నష్టం జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని జడల పేట గ్రామ శివారు గాంధీనగర్ లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. గ్రామానికి చెందిన రత్న సారయ్య పూరి గుడిసె పై సోమవారం రాత్రి పిడుగు పడడడంతో పూర్తిగా దగ్ధమైంది.
ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న నగదు, బంగారం వస్తువులు, వంట సామాగ్రి, దుస్తులు మొత్తం కాలి బూడిదై రూ 5 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు తెలిపారు. రత్న సారయ్య కుమారుడు మూడు రోజుల క్రితం అనారో గ్యంతో చికిత్స కోసం వరంగల్ లోని ఆసుపత్రికి కుటుంబం అంతా వెళ్ళింది. పిడుగు పడిన సమయంలో కుటుంబ సభ్యులు లేకపోవడంతో వారు ప్రాణాలతో బతికిపోయారని గ్రామస్తులు తెలిపారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.

