9thJuneeditorial | తృణమూల్‌లో చీలికలు.. మమతకు కొత్త సవాళ్లు

9thJuneeditorial | తృణమూల్‌లో చీలికలు.. మమతకు కొత్త సవాళ్లు

9thJuneeditorial | ప్రతిపక్ష ఐక్యతపై బీజేపీ వ్యూహం
రాహుల్ నాయకత్వంపై కూటమిలో అసంతృప్తి
నాయకుల అహమే ఇండియా కూటమికి బలహీనత?

9thJuneeditorial | దేశంలో ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బతీయడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మొదటి నుంచి ప్రయత్నిస్తూనే ఉంది. అయితే, అవి ప్రజాస్వామ్యయుతంగా సాగేవి. ప్రతిపక్షాల కూటముల జోలికి తొలి ప్రధాని నెహ్రూ వెళ్లలేదు. ప్రతిపక్షాలు బలంగా ఉండాలని ఆయన కోరుకున్నారు. ఆయన కుమార్తె ఇందిరాగాంధీ ప్రతిపక్షాలను నిలువనీడ లేకుండా చేయాలని రాజకీయ ఎత్తులు, ఫిరాయింపు రాజకీయాలను ప్రోత్సహించేవారని తరచూ విమర్శించిన బీజేపీ నాయకులు ఇప్పుడు అదే పంథాలో నడుస్తున్నారు.

ఇందుకు తాజాగా బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌ను నామరూపాలు లేకుండా చేయాలని బీజేపీ నాయకులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. బీజేపీని ఢీకొట్టినందుకు తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీపై కేంద్రంలోని బీజేపీ నాయకులు పగబట్టారు. ఆమె పార్టీని చీల్చారు. అయితే, ఇందులో ఆమె స్వయంకృతం కూడా ఉంది.

పార్టీ వ్యవహారాలపై సీనియర్ నాయకులను సంప్రదించకుండా, తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి పార్టీలో కీలక స్థానం కల్పించడం, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అధికారం ఇవ్వడం వంటి ఆమె చర్యలు నచ్చని వారు ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారు. ఆమె నాయకత్వం నచ్చకపోతే బయటికి రావడంలో తప్పులేదు. కానీ, వీరంతా బీజేపీకి దగ్గరవడానికి ప్రయత్నించడాన్ని బట్టి కమలనాథులే ఈ చీలికను ప్రోత్సహిస్తున్నారన్న అనుమానం కలుగుతోంది.

ప్రస్తుత ముఖ్యమంత్రి సువేందు అధికారి ఈ చీలికను ప్రోత్సహిస్తున్నారన్న వార్తలు వచ్చాయి. బీజేపీ నాయకులు నేరుగా ఈ చీలికను ప్రోత్సహించకుండా, ఆయన ద్వారా చేయిస్తున్నారన్న విశ్లేషణలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి. తృణమూల్ నుంచి రాజీనామా చేస్తున్న వారంతా స్వచ్ఛందంగా పార్టీని వీడుతున్నారని కానీ, మమత విధానాలు నచ్చక బయటికి వస్తున్నారని కానీ అనుకోలేం. గడిచిన పది, పదిహేను సంవత్సరాలుగా ఆమె నాయకత్వంలో పని చేసినవారు ఇప్పుడు పార్టీని వీడుతుండటం వెనుక బీజేపీ నాయకుల ప్రేరణ, ప్రోద్బలం ఉండి ఉండవచ్చు.

ఇక ఇండియా కూటమి బలహీనపడటానికి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నాయకత్వం నచ్చని వారే బయటికి వెళ్తున్నారు. ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న వారు కాంగ్రెస్‌లోనే ఉన్నారు. అలా వ్యతిరేకించే వారంతా ఆ పార్టీని వీడారు. అసలు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా అలా వేరు కుంపటి పెట్టుకున్నవారే. ఆప్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కూడా ఇండియా కూటమి నుంచి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. అప్పుడు మిగిలేది కాంగ్రెస్ మాత్రమే అవుతుంది.

ఇండియా కూటమి కకావికలు కావడంలో ఆ పార్టీ నాయకుల వ్యక్తిగత అహం కూడా కారణమే. ఆ బలహీనతలను బీజేపీ ఉపయోగించుకుంటున్నది. ప్రతిపక్షం బలంగా ఉంటేనే ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా నడుస్తుంది.

Leave a Reply