JEE Mains | జేఈఈ ప‌రీక్ష‌లు మ‌రింత క‌ఠినం..

ఐఐటీ, ఎన్‌ఐటీలలో ప్రవేశం నిమిత్తం నిర్వహించే జేఈఈ మెయిన్‌ రెండో సెషన్‌ పరీక్షలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ సంవత్సరం ఈ పరీక్షను రెండుసార్లు నిర్వహిస్తున్నారు. తొలి విద‌డ జ‌న‌వ‌రీలో జ‌ర‌గ్గా.. ఏప్రిల్‌ 2 నుంచి రెండో సెషన్ జ‌ర‌గ‌నుంది.

కాగా, ఈ పరీక్షల్లో జాయింట్‌ అడ్మిషన్‌ బోర్డు(జేఏబీ) ఈ సంవత్సరం కొన్ని కీలక మార్పులు చేసింది. జేఈఈ మెయిన్‌ -2025లో బీఈ, బీటెక్‌ విద్యార్థులకు పేపర్‌-1 నిర్వహిస్తారు. ఈ సంవత్సరం పేపర్‌-1లోని పార్టు- బీలో ఛాయిస్‌ విధానాన్ని తొలగించారు. పార్టు-బీలో ఈ సారి 5 ప్రశ్నలే అడుగుతారు.

విద్యార్థులు తప్పనిసరిగా ఈ 5 ప్రశ్నలు రాయాలి. 3 సబ్జెక్టులు (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ)లలో పార్టు-ఏలో 20 ప్రశ్నలు, పార్టు-బిలో 5 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 75 ప్రశ్నలకు సమాధానం రాయాల్సి ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు 4 మార్కుల చొప్పున మొత్తం పేపర్‌-1 నుంచి 300 మార్కులకు పరీక్ష నిర్వహించనున్నారు.

బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్ట్‌ విద్యార్థులకు పేపర్‌- 2ఏ, బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ విద్యార్థులకు పేపర్‌- 2బీ నిర్వహిస్తారు.

Leave a Reply