రోడ్డు భద్రత నిబంధనలు తప్పనిసరి

రోడ్డు భద్రత నిబంధనలు తప్పనిసరి

  • సర్పంచ్ దీకొండ విజయ్‌కుమార్

కడెం, ఆంధ్రప్రభ : ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పెద్దూరు-కడెం గ్రామ సర్పంచ్ దీకొండ విజయ్‌కుమార్ సూచించారు. సోమవారం మండల కేంద్రం కడెంలోని పెద్దూరు గ్రామపంచాయతీ కార్యాలయంలో రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా గ్రామస్తులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రోడ్డు భద్రత నిబంధనలపై వివరించారు. అలాగే కడెం ప్రధాన రహదారిపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని జీపీ పాలకవర్గ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.

అదేవిధంగా రోడ్డు భద్రత నూతన కమిటీని ఏర్పాటు చేసి, చైర్మన్‌గా స్థానిక సర్పంచ్ దీకొండ విజయ్‌కుమార్‌తో పాటు 12 మంది సభ్యులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో కడెం పీఎస్ ఏఎస్ఐ ఉమాపతి, ఉప సర్పంచ్ పిట్టల రాజన్న, పంచాయతీ కార్యదర్శి ఎండి మునవర్ హసన్, జీపీ వార్డు సభ్యులు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply