యువతిపై దాడి.. ఆస్పత్రికి తరలింపు

యువతిపై దాడి.. ఆస్పత్రికి తరలింపు

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం రొట్టె పల్లి గ్రామంలో ఓ యువతి పై కొందరు వ్యక్తులు గురువారం సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో దాడి చేశారు. ఈ సంఘటనలో అపస్మానికస్థితికి స్థితిలో కింద పడిపోయిన యువతిని కుటుంబీకులు బెల్లంపల్లి ప్రభుత్వఏ రియా ఆసుపత్రికి తరలించారు.బాధితురాలు కుటుంబీకుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.పోగుల అక్షిత్ కుమార్ అనే యువకుడు ఎదురింట్లో గల అల్క అక్షత ను గురువారం ప్రేమ వివాహం చేసుకున్నాడు.

సాయంత్రం వరకు అక్షిత ఇంటికి రాకపోవడంతో కోపోద్రేకులైన అక్షత కుటుంబీకులు బంధువులు మూకుమ్మడిగా పోగుల సదాపై దాడి చేసి పిడిగుద్దులు గుద్దుతూ కాళ్ళ తో ఇష్టా రీతిన తన్నారని పేర్కొన్నారు. ఈ సంఘటనలో సదా కింద పడిపోగా కుటుంబీకులు బంధువులు ఆమెను బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న దేవిపుర ఎస్సై అర్కిల్ల గంగారాం ఆసుపత్రికి చేరుకొని బాధితురాలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. సదా పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన చికిత్స కొరకు వైద్యులు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply