వాహనాలకు పెట్రోల్, డీజిల్ కొరత లేదు..

వాహనాలకు పెట్రోల్, డీజిల్ కొరత లేదు..
చిట్యాల,ఆంధ్రప్రభ : మండల పరిధిలో వాహన దారులకు పెట్రోల్, డీజిల్ ,కొరతలేదని నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, చిట్యాల ఎస్ఐ పోచంపల్లి సతీష్ తెలిపారు. బుధవారం పెట్రోల్ బంక్ యజమానులతో ఎస్ఐ పోలీస్ స్టేషన్లు సమావేశం నిర్వహించారు .అనంతరం ఆయన మాట్లాడుతూ పెట్రోల్ ,డీజిల్ మండలంలోని అన్ని బంకుల్లో సరిపడా నిల్వలు,అందుబాటులోఉన్నాయన్నారు.
సోషల్ మీడియాలో బయట వినిపించే పెట్రోల్ కొరత వార్తల కేవలం పుకార్లు మాత్రమే అని,వాటిని నమ్మి ప్రజలు ఆందోళన ఆందోళన ఆందోళన చెందుద్దన్నారు. బంకు యజమానివినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, కృత్రిమ కొరత సృష్టించవద్దనియజమానులకు ఎస్సై సూచించారు.
పెట్రోల్ కోసం బంకుల వద్ద అనవసరంగా గుమిగూడి ట్రాఫిక్ సమస్యలు సృష్టించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు
