Telangana | చికిత్స పొందుతున్న విద్యార్థి

Telangana | చికిత్స పొందుతున్న విద్యార్థి

Telangana | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సరంపల్లి గ్రామం వద్ద ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో పాముకాటు ఘటన కలకలం రేపింది. పదవ తరగతి చదువుతున్న చరణ్ అనే విద్యార్థిని పాము కరిచినట్లు సమాచారం. ఈ ఘటనతో స్కూల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

వెంటనే అప్రమత్తమైన సిబ్బంది, స్థానికులు విద్యార్థిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Telangana

Leave a Reply