వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం చేయవద్దు…..

వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం చేయవద్దు…..
జిల్లా వైద్యాధికారి రవీందర్ గౌడ్…
బిక్కనూర్, ఆంధ్ర ప్రభ : ఆస్పత్రికి వచ్చే రోగులకు వైద్య పరీక్షలు అందించడంలో సిబ్బంది నిర్లక్ష్యం చేయవద్దని జిల్లా వైద్యాధికారి రవీందర్ గౌడ్ సూచించారు. మంగళవారం మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పలు వార్డులలో పర్యటించి అక్కడ ఉన్న వసతులను పరిశీలించారు అనంతరం ల్యాబ్ తో పాటు ఫార్మసీని సందర్శించారు. ఫార్మసీలో ఉన్న మందుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాలు 100% పూర్తి చేయాలని ఆదేశించారు వైద్య సిబ్బంది సమయపాలన పాటిస్తూ విధులకు హాజరు కావాలని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్య సిబ్బంది ఆయా ప్రజలకు అందుబాటులో ఉండి ఆరోగ్య ఉప కేంద్రాల ద్వారా మెరుగైన సేవలు అందించాలని తెలిపారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉండే విధంగా చూడాలన్నారు. రోగుల నుండి ఫిర్యాదులు వస్తే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం పలు రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట వైద్యాధికారి దివ్య, ఆరోగ్య విస్తీర్ణ అధికారి వెంకటరమణ వైద్య సిబ్బంది ఉన్నారు.


