చిరుతపులి హతం.. ముగ్గురు వేటగాళ్ల అరెస్ట్

చిరుతపులి హతం.. ముగ్గురు వేటగాళ్ల అరెస్ట్

  • ఊట్ల అడవుల్లో చిరుతపులిని హతమార్చిన వేటగాళ్లు
  • ముగ్గురు అరెస్ట్ , 13 గోర్లు స్వాధీనం

జన్నారం, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ డివిజనల్ పరిధిలోని తాళ్లపేట ఫారెస్ట్ రేంజ్ లోని ఊట్ల అడవుల్లో చిరుతపులిని వేటగాళ్లు హతమార్చారు. చిరుత పులిని హతమార్చిన కేసులో ముగ్గురు వేటగాళ్లను అరెస్టు చేసి,13 పులి గోర్లను స్వాధీనం చేసుకొని,కేసు దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎఫ్డీఓ ఓ ఎం. రామ్మోహన్ శనివారం రాత్రి తెలిపారు.

దండేపల్లి మండలంలోని ఊట్ల గ్రామానికి చెందిన మొడితె వెంకటేష్, శ్రీనివాస్,అదే మండలంలోని పాత మామిడిపల్లికి చెందిన వనపర్తి శ్రీనివాస్ లు కలిసి ఊట్ల గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో మోటార్ వాహనాల క్లచ్ వైర్ తో చేసిన ఉచ్చులు వేసి చిరుతను చంపారన్నారు. ఆ తర్వాత ఆ వేటగాళ్లు చిరుత 13 గోర్లను తీసుకొని మృతదేహాన్ని అక్కడే కాల్చి వేశారని ఆయన చెప్పారు.

పశువైద్యాధికారిచే పోస్టుమార్టం నిర్వహించి, ఆ వేటగాళ్లను కోర్టులో హాజరు పరచమన్నారు.డాగ్స్ స్క్వాడ్ హంటర్ తో సాయంతో చిరుతపులికి సంబంధించిన కీలక సాక్షాలను సేకరించినట్లు ఆయన తెలిపారు.ఈ విషయం తెలుసుకున్న కవ్వాల టైగర్ రిజర్వు ఎఫ్డీపీటీ,సీఎఫ్ శాంతారాం,మంచిర్యాల డీఎఫ్ఓ శివ్ఆశీష్ సింగ్, స్థానిక ఎఫ్డీఓ రామ్మోహన్,తాళ్లపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వి.సుష్మారావు,డాగ్స్ స్క్యాడ్ ఇంచార్జి ఎల్. అనిల్ కుమార్ హంటర్ తో,ఇతర అటవీ అధికారులు శనివారం మధ్యాహ్నం వేటగాళ్లు చిరుతపులిని హతమార్చిన దండేపల్లి ఫారెస్ట్ సెక్షన్లోని ఊట్ల అటవీ ప్రాంతానికి వెళ్లారు.

ఆ చిరుతను తాళ్లపేట రేంజ్ లోని ఊట్ల,పాతమామిడిపళ్లికి చెందిన 3 వేటగాళ్లు హతమార్చి,ఆ చిరుతపులి గోర్లను తీసుకొని వెళ్లి లక్షెట్టిపేట ప్రాంతంలో విక్రయించడానికి ప్రయత్నించగా, మంచిర్యాల డీఎఫ్ఓకు అందిన సమాచారం మేరకు తాళ్లపేట అటవీ అధికారులు ఆ వేటగాళ్లను పట్టుకొని విచారిగా,ఆ వేటగాళ్లు నేరం అంగీకరించారు. ఈ సంఘటన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చర్చనీయాంశమైంది.

Leave a Reply