గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ముందస్తు చర్యలు తీసుకోవాలి

గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ముందస్తు చర్యలు తీసుకోవాలి
మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి లేఖ రాసిన ఎంపీ అర్వింద్
నిజామాబాద్, ఆంధ్రప్రభ : రాబోయే గోదావరి పుష్కరాలు–2027ను దృష్టిలో ఉంచుకుని నిజా మాబాద్ పార్లమెంట్ పరిధి లోని గోదావరి నది తీర ప్రాంతాల్లో ఉన్న ఘాట్ల వద్ద సమగ్ర ఏర్పాట్లు చేప ట్టాలని ఎంపీ అర్వింద్ ధర్మపురి రాష్ట్ర ప్రభుత్వా న్ని కోరారు. ఈ మేరకు రాష్ట్ర రోడ్లు , భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో గోదా వరి తీరం వెంట ఉన్న ఘాట్లకు కోట్లాది భక్తులు వచ్చే అవకాశం ఉందని ఎంపీ తెలిపారు. ముఖ్యం గా కందకుర్తి, పోచంపాడ్, తడపాకల్, వాల్గొండ వంటి ప్రధాన ఘాట్ల వద్ద భారీగా భక్తుల రద్దీ ఉండనున్నందున ఈ ప్రాంతాల్లో ప్రత్యేకంగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాల్సిన అవ సరం ఉందన్నారు.
ఘాట్ల అభివృద్ధి, రహదారుల విస్తరణ, ట్రాఫిక్ నిర్వహణ, తాగు నీరు, మరుగుదొడ్లు, పారిశుధ్య సదుపాయాలు, పోలీస్ భద్రత, సీసీ కెమెరాలు, వైద్య శిబిరా లు, అంబులెన్స్‌లు, అగ్నిమాపక సేవలు, విద్యుత్ సరఫరా, హైమా స్ట్ లైట్లు, ఆర్టీసీ ప్రత్యేక బస్సులు మరియు పార్కిం గ్ ఏర్పాట్లు వంటి అంశా లపై ప్రభుత్వం ముంద స్తుగా చర్యలు తీసు కోవాలని ఎంపీ కోరారు.
పుష్కరాల సమయంలో కోట్లాది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అవసరమైన నిధులను వెంటనే మంజూ రు చేసి పనులను మిషన్ మోడ్‌లో పూర్తి చేయాలని ఎంపీ అర్వింద్ ధర్మపురి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
