Sai durga tej | రిస్క్ చేస్తున్నాడా…

Sai durga tej | రిస్క్ చేస్తున్నాడా…

Sai durga tej | తేజ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ‘సంబరాల ఏటిగట్టు’
100 కోట్ల నుంచి 120 కోట్లకు పెరిగిన బడ్జెట్
రిలీజ్ ఆలస్యం వెనుక అసలు కారణం ఏంటి?
క్లైమాక్స్‌కు 20 కోట్ల ఖర్చు?
రిస్క్ చేస్తున్నారా నిర్మాతలు?
తేజ్ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందా?

Sai durga tej | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మెగాస్టార్ మేనల్లుడుగా కెరీర్ స్టార్ట్ చేసి అనతి కాలంలోనే.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. వరుసగా సక్సెస్ సాధిస్తూ దూసుకెళుతున్న తేజ్ కి యాక్సిడెంట్ జరగడంతో సినీ ప్రయాణం కాస్త స్లో అయ్యింది. ఆతర్వాత విరూపాక్ష, బ్రో సినిమాలతో వరుసగా సక్సెస్ సాధించిన తర్వాత మరింత స్పీడు పెంచుతాడు అనుకుంటే.. మరింత స్లో అయ్యింది. ఎప్పటి నుంచో షూటింగ్ లో ఉన్న సంబరాల ఏటిగట్టు ఇంత వరకు రిలీజ్ కాలేదు. ఇప్పుడు ఈ మూవీ విషయంలో రిస్క్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ.. సంబరాల ఏటిగట్టు ఎందుకు ఆలస్యం అవుతుంది..? ఈ మూవీ విషయంలో చేస్తున్న రిస్క్ ఏంటి…?

Sai durga tej | 120 కోట్ల బడ్జెట్..

Sai durga tej

తేజ్.. కేపీ రోహిత్ అనే కొత్త దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో.. సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. ఈ సినిమాని హనుమాన్ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. అయితే.. ఈ సినిమా కథ వైవిధ్యంగా ఉండడంతో ఆయన ఎంత బడ్జెట్ అయినా పెట్టడానికి రెడీ అంటూ ముందుకు వచ్చారు. ఇది తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా. విరూపాక్ష మూవీ 100 కోట్ల క్లబ్ లో చేరిందని.. తేజ్ మూవీకి 100 కోట్లకు పైగా బడ్జెట్ పెడుతున్నారు. అయితే.. 100 కోట్లు అనుకున్న ఈ మూవీ బడ్జెట్.. ఇప్పుడు 120 కోట్లకు చేరుకుందని వార్తలు వస్తున్నాయి.

Sai durga tej | క్లైమాక్స్ కి 20 కోట్లా…?

Sai durga tej

సంబరాల ఏటిగట్టు మూవీ గత సంవత్సరం దసరాకి రిలీజ్ కావాలి కానీ.. ఇంత వరకు రిలీజ్ కాలేదు. ఈ సమ్మర్ కి కూడా వస్తుందని అప్ డేట్ లేదు. అసలు ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు. ఆమధ్య ఈ సినిమాకి బడ్జెట్ పెరిగిపోయిందని.. సినిమా ఆగిపోయిందని.. వార్తలు వచ్చాయి. రీసెంట్ గా తేజ్.. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే కొత్త సినిమాలు ఓకే చేశారని, త్వరలో అనౌన్స్ చేస్తారని టాక్ వినిపించింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ మూవీ క్లైమాక్స్ ను అత్యంత భారీగా తీర్చిదిద్దుతున్నారని.. ఒక్క క్లైమాక్స్ షూటింగ్ కే 20 కోట్లు బడ్జెట్ పెడుతున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే.. ఆల్రెడీ 120 కోట్లు బడ్జెట్ అయిన సినిమా క్లైమాక్స్ కి ఇంకా 20 కోట్లు పెడుతున్నారా..? అని సినీ జనాలు, అభిమానులు షాక్ అవుతున్నారు. ఇది నిజంగానే రిస్క్. మరి.. ఈ రిస్కీ ప్రాజెక్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో..? ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో అనేది ఆసక్తిగా మారింది.

Sai durga tej

Leave a Reply