Nag100 | 100వ సినిమా ఎప్పుడు…?

Nag100 | 100వ సినిమా ఎప్పుడు…?
Nag100 | కార్తీక్ దర్శకత్వంలో నాగ్ 100వ సినిమా
వైవిధ్యమైన కథతో మైలురాయి చిత్రం
మైసూర్ షూటింగ్ వెనుక సెంటిమెంట్
లలిత మహల్ ప్యాలెస్‌లో కీలక సన్నివేశాలు
దసరాకి నాగ్ 100 విడుదల ప్లాన్
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్రత్యేక ఆకర్షణ
Nag100 | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : టాలీవుడ్ కింగ్ నాగార్జున కెరీర్ లో మైల్ స్టోన్ లా నిలిచే 100వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీని కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ తెరకెక్కిస్తున్నారు. ఈ క్రేజీ మూవీని ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్ గా షూటింగ్ చేస్తున్నారు. అయితే.. ఈ మూవీ విషయంలో నాగ్ ఓ సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నారనే వార్త బయటకు వచ్చింది. ఇంతకీ.. నాగ్ ఫాలో అవుతున్న ఆ సెంటిమెంట్ ఏంటి..? ఈ క్రేజీ మూవీ థియేటర్స్ లోకి వచ్చేది ఎప్పుడు…?
Nag100 | కార్తీక్ డైరెక్షన్ లో నాగ్ 100

నాగార్జున 100వ సినిమా కోసం చాలా కథలు విన్నారు. కెరీర్ లో 100వ సినిమా అంటే చాలా అంటే చాలా ప్రత్యేకం. అలాంటి ప్రత్యేకమైన సినిమాని రెగ్యులర్ స్టోరీతో చేయకూడదు. వైవిధ్యమైన కథతో చేయాలని నాగ్ తపించారు. ఆఖరికి ఆయన అనుకున్నట్టుగానే డిఫరెంట్ స్టోరీని కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ చెప్పడంతో ఆ కథతోనే నాగ్ 100వ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాని నాగార్జునే అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తుండడం విశేషం. అయితే.. అసలు కథ ఏంటి..? ఈ మూవీ జోనర్ ఏంటి అనేది మాత్రం బయటకు రాలేదు.
Nag100 | నాగ్ సెంటిమెంట్ ఇదే..

ఈ మూవీ ప్రస్తుతం కర్ణాటకలోని మైసూర్ లో షూటింగ్ జరుపుకుంటుంది. అక్కడ నాగార్జునతో పాటు ప్రధాన తారాగణం పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే.. మైసూర్ లో షూటింగ్ చేయడానికి ప్రత్యేక కారణం ఉందట. కథలో కీలకమైన పాతకాలపు భవనాలు, పచ్చని ప్రకృతి, ప్రశాంతమైన వాతావరణం అక్కడ ఉండడం ఓ కారణమైతే.. మైసూర్ అనేది నాగార్జునకు సెంటిమెంట్ కావడం మరో కారణం. అవును.. మైసూర్ లో మనం, సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు తదితరు చిత్రాలు షూటింగ్ చేశారు. ఆ సినిమాలు నాగార్జునకు మంచి విజయాల్ని అందించాయి. అందుకనే కెరీర్ లో 100వ సినిమాను కూడా సెంటిమెంట్ గా అక్కడ షూట్ చేయాలి అనుకున్నారట.
Nag100 | దసరాకి నాగ్ 100 రిలీజ్..

మైసూర్‌లోని లలిత మహల్ ప్యాలెస్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అలాగే చారిత్రక కట్టడాలు ఉన్న ప్రదేశాల్లో కూడా షూటింగ్ చేస్తున్నారట. ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇంతకీ ఈ సినిమా రిలీజ్ ఎప్పుడంటే.. ముందుగా.. తన మొదటి సినిమా విక్రమ్, మనం సినిమాలు రిలీజైన మే 23నే ఈ క్రేజీ మూవీని కూడా రిలీజ్ చేయాలి అనుకున్నారు నాగ్. అయితే.. రిలీజ్ డేట్ ముందుగా లాక్ చేసుకుని హడావిడిగా షూట్ చేయడం కంటే.. ప్రశాంతంగా ఎలాంటి టెన్షన్ లేకుండా షూట్ చేయాలని ప్లాన్ మార్చారు. ఇప్పుడు దసరాకి ఈ మూవీని రిలీజ్ చేయాలి అనుకుంటున్నారని తెలిసింది. మరి.. నాగ్ 100వ సినిమాతో.. ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తారో చూడాలి.
