కాంగ్రెస్ నేతల దాడిలో పసికందు బలి.. దుర్మర్గం

కాంగ్రెస్ నేతల దాడిలో పసికందు బలి.. దుర్మర్గం

న్యాయం చేయలేని రాష్ట్ర ప్రభుత్వం.
మాజీ ఎంపీటీసీ ఊరిపక్క సరితనగేష్ విమర్శ.

మర్రిగూడ,ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం చేతగాని తనo వల్లనే కుమ్మెర మల్లన్న స్వామి జాతరలో పసికందు బలైందని నామపురం ఎంపీటీసీ ఊరిపక్క సరితనగేష్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఆదివారం అతను మాట్లాడుతూ కుమ్మెర మల్లన్న స్వామి జాతర సందర్భంగా జరిగిన దాడిలో రెండు నెలల చిన్నారి మృతి చెందడం అత్యంత దారుణమని, ఇది పూర్తిగా అధికార దర్పంతో జరిగిన హింసాత్మక ఘటన అని బీఆర్ఎస్ నాయకులు ఊరిపక్క నగేష్ ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ పాలనలో పేదల ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. అధికార పార్టీకి చెందిన సర్పంచ్‌, అగ్రకుల నాయకుల దాడిలో రెండు నెలల చిన్నారి ప్రాణాలు పోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అని తీవ్రంగా విమర్శించారు. చట్టం అధికార పార్టీకేనా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ పాలనలో కుల వివక్ష మరింత బలపడుతోంది. దళితులు, వెనుకబడిన వర్గాలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం కళ్లుమూసుకుంటోంది.

చిన్నారి మృతికి బాధ్యులైన కాంగ్రెస్ నాయకులపై వెంటనే కేసులు నమోదు చేసి అరెస్టు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఉద్యమం చేస్తారు అని ఆయన హెచ్చరించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. ఇది రాజకీయాలకు అతీతమైన మానవత్వం ప్రశ్న అని పేర్కొంటూ మానవత్వం కలిగిన ప్రతీ ఒక్కరు ఈ కుటుంబానికి అండగా నిలవాలన్నారు.

పార్టీలు, కులాలు చూడకుండా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలంతా స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అధికార పార్టీ అండతో దోషులు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఇలాంటి అన్యాయాలపై మౌనం పాటిస్తే రేపు మరెన్నో కుటుంబాలు ఇలాగే బలవుతాయిని హెచ్చరించారు.

Leave a Reply