సంగారెడ్డి, మార్చి 14 (ఆంధ్రప్రభ): సంగారెడ్డి జిల్లా పోలీసు గ్రౌండ్స్ నందు ఏర్పాటు చేసిన హోలీ కార్యక్రమాల్లో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ స్వయంగా పాల్గొని అధికారులకు, సిబ్బందికి రంగులు పూసి, హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
సంగారెడ్డి జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ…ఈ రంగుల హోలీని ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ సహజ సిద్ధమైన రంగులతో జరుపుకోవాలని సూచించారు. బలవంతపు రంగులు పూయడం, మద్యం తాగి వాహనాలు నడుపుతూ ర్యాష్ డ్రైవింగ్ చేయరాదన్నారు. మద్యం సేవించి చెరువులు, కుంటలకు వెళ్లరాదని, జలాశయాల వద్ద లోతట్టు ప్రాంతాల్లో తగు జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ సూచించారు.
