Gujarat – మ‌ద్యం మత్తులో కారు డ్రైవింగ్ .. మ‌హిళ మృతి

వ‌డోద‌ర – గుజరాత్ లోని వడోదరలో మద్యం మత్తులో కారు నడిపి ఓ యువకుడు బీభత్సం సృష్టించాడు. 100 కిలోమీటర్ల వేగంతో కారు నడిపి బైకర్స్ ను ఢీ కొట్టాడు. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు

కారు నడిపిన యువకుడు డియోన్ టెక్నాలజీస్ కంపెనీ యజమాని కుమారుడిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. చనిపోయిన మహిళను హేమాలిబెన్ పటేల్‌గా గుర్తించారు. ఇక ఈ ప్రమాదంలో జైని (12), నిషాబెన్ (35), ఓ 10 ఏళ్ల బాలిక, 40 ఏళ్ల వ్యక్తిని ఆసుపత్రిలో చేర్చారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *