Ambati Rambabu | ఆటో కార్మికుల‌కు చేయూత‌…

Ambati Rambabu | ఆటో కార్మికుల‌కు చేయూత‌…

Ambati Rambabu | భవానిపురం, ఆంధ్రప్రభ : స‌మాజంలో పేద‌రికం నిర్మూలించాల‌న్న సీఎం చంద్ర‌బాబు ఆశ‌య స్పూర్తితో ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఆటో కార్మికుల‌కు అండ‌గా నిలిచి చేయూత అందించేందుకు త‌న సొంత నిధుల‌తో చేప‌ట్టిన ఆటోల పంపిణీ కార్య‌క్ర‌మం వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతుంద‌ని మాజీ ఎమ్మెల్సీ , టిడిపి రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బుద్దా వెంక‌న్న‌, రాష్ట్ర దూదేకుల ఫైనాన్స్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ కె.నాగుల్ మీరా అన్నారు. ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం వ‌న్ టౌన్ గ‌ణ‌ప‌తిరావు రోడ్ లో గ‌ల ఎంపీ కేశినేని శివ‌నాథ్ క్యాంపు కార్యాల‌యంలో గురువారం ఆటోల పంపిణీ కార్య‌క్ర‌మం జ‌రిగింది.

ఎంపీ కేశినేని శివ‌నాథ్ త‌న సొంత నిధుల‌తో సితార జంక్ష‌న్ లోని టి.ఎన్.టి.యు.సి అనుబంధ సంస్థ విజ‌య‌దుర్గా గూడ్స్ ఆటో ఓన‌ర్స్ డ్రైవ‌ర్స్ అసోసియేష‌న్ కి చెందిన ముగ్గురు కార్మికులకు మూడు ఆటోలు ఏర్పాటు చేశారు. ఈ ఆటోల పంపిణీ కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిథులుగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్సీ టిడిపి ప్రధాన కార్య‌ద‌ర్శి బుద్ధా వెంక‌న్న‌, రాష్ట్ర దూదేకుల ఫైనాన్స్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ నాగుల్ మీరా, ఉమ్మ‌డి కృష్ణాజిల్లాల గ్రంథాల‌య చైర్మ‌న్ ఎమ్.ఎస్. బేగ్, టిడిపి మైనార్టీ సెల్ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఫ‌తావుల్లా ఆటోలు పంపిణీ చేయ‌టంతో పాటు జెండా ఊపి ఆటోలు ప్రారంభించారు.

Ambati Rambabu |

ఎంపి కేశినేని శివ‌నాథ్ స‌హ‌కారంతో ఏర్పాటు చేసిన మూడు ఆటోల‌ను ఆటో కార్మికులు 44వ డివిజ‌న్ కి చెందిన త‌మ్మ ప‌వ‌న్ కుమార్, 45వ డివిజ‌న్ కి చెందిన చింత వెంక‌ట నారాయ‌ణ‌, ఎమ్.డి జాఫ‌ర్ భాష అందుకున్నారు. ఆటోలు ఇప్పించినందుకు ఎంపీ కేశినేని శివ‌నాథ్ కి ఆటో కార్మికులు కృత‌జ్ఞ‌తలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా మాజీ ఎమ్మెల్సీ టిడిపి ప్రధాన కార్య‌ద‌ర్శి బుద్ధా వెంక‌న్న మాట్లాడుతూ పేద ఆటో కార్మికులకు ఉపాధి భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఎంపీ కేశినేని శివనాథ్ తన సొంత నిధులతో మూడు ఆటోలను పంపిణీ చేశార‌న్నారు.

Ambati Rambabu |

రోజువారీ జీవనాధారం కోసం ఆటో నడిపే కార్మికులకు ఎంపీ కేశినేని శివనాథ్ అండగా నిలవడం అభినందనీయమన్నారు. ఆయన అందించిన సహాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పేదరికం లేని సమాజ నిర్మాణమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని, అదే స్పూర్తితో ఎంపీ పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో తప్పు చేసినవారికి శిక్ష తప్పదని కూడా పేర్కొన్నారు. వైసిపి నాయ‌కుడు అంబటి రాంబాబు చేసింది ముమ్మాటికి తప్పేనంటూ..తప్పు చేశాడు కాబ‌ట్టే రాజమండ్రి జైలు కి వెళ్లాడన్నారు.

Ambati Rambabu |

ఉమ్మ‌డి కృష్ణా జిల్లాల గ్రంథాల‌య చైర్మ‌న్ ఎమ్.ఎస్ బేగ్, రాష్ట్ర మైనార్టీ సెల్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఫ‌తావుల్లాహ్, మాట్లాడుతూ, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఎంపీ కేశినేని శివ‌నాథ్ నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కుల‌మ‌తాల‌కు అతీతంగా పేదలను ఆదుకుంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నార‌ని, ఇందువ‌ల్ల ఎంతో మందికి ల‌బ్ధి చేకురుతుంద‌న్నారు.

Ambati Rambabu |
Ambati Rambabu |
Ambati Rambabu |
Ambati Rambabu |
Ambati Rambabu |

Leave a Reply