న్యాయవాదుల విధుల బహిష్కరణ..

హుజూర్నగర్, ఆంధ్రప్రభ ; బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హుజూర్ నగర్ లో గురువారం న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి కోర్టు ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ… నల్లగొండ బార్ అసోసియేషన్ సభ్యుడు, న్యాయవాది నరేష్ కుటుంబ సభ్యులపై కొందరు దుండగులు దాడి చేసి అతని కుటుంబ సభ్యులను కొట్టి గాయపరచటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇటీవల కాలంలో న్యాయవాదులపై భౌతిక దాడులకు, హత్యలకు పాల్పడటం పరిపాటి అయిందని అటువంటి చర్యలు న్యాయ వ్యవస్థకే గొడ్డలి పెట్టు అన్నారు.
న్యాయవాదులపై వరస దాడులు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ఎంత మాత్రం స్పందించకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయవాదుల రక్షణ చట్టాన్ని రూపొందించి అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేనట్లయితే రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు తమ హక్కుల సాధన కొరకు ఉద్యమిస్తారని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కాల్వ శ్రీనివాసరావు, చనగాని యాదగిరి, ఎంఎస్ రాఘవరావు, ఉప్పల గోపాలకృష్ణమూర్తి, జక్కుల వీరయ్య, కమతం నాగార్జున, ఒట్టికూటి అంజయ్య, కొట్టు సురేష్, సాముల సురేందర్ రెడ్డి, పాలేటి శ్రీనివాసరావు, పిడమర్తి చంద్రయ్య, చక్రాల వెంకటేశ్వర్లు, ఆసోజు రామారావు, సైదా హుస్సేన్, సాయిరాం గౌడ్, శ్రీను నాయక్, చనగాని మహేష్, దాసరి మోహన్, శివ కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు తమ విధుల బహిష్కరణ కార్యక్రమానికి సహకరించవలసినదిగా కోరుతూ న్యాయమూర్తులు మారుతీ ప్రసాద్, ఆయేషా సరీన్ లకు బార్ అసోసియేషన్ తీర్మాన ప్రతులను న్యాయవాదులు అందించారు.
