Ambati | పోరాటం ఆగదు…

Ambati | పోరాటం ఆగదు…

  • ధర్మమే గెలుస్తోంది…

Ambati | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : అరెస్టైన వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. కోర్టు నుంచి బెయిల్ రావడంతో ఆయన జైలు నుంచి రిలీజ్ అయ్యారు. బయటకు వచ్చిన అనంతరం ఆయన మాట్లాడుతూ… నా ఇంటిపై దాడి చేశారు. నన్ను హింసించారు. నా భార్య, పిల్లల్ని తరిమారు. నా కార్లను ధ్వంసం చేశారు. నా ఇల్లు తగలబెట్టేందుకు యత్నించారన్నారు.

ఐ డోంట్ కేర్. ఎన్నికేసులు పెట్టినా.. జైల్లో వేసినా భయపడేది లేదన్నారు బాధితుడిని లోపల పెట్టి.. నిందితుడిని వదిలారన్నారు. నాపై పెట్టిన కేసులన్నీ బెయిలబుల్ కేసులేనన్నారు. పార్టీలకు అతీతకంగా దాడిని ఖండించిన వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. దేవుడున్నాడు.. ధర్మమే గెలుస్తోందిన్నారు. ఏమైంది.. ఏమవుతుందని చంద్రబాబు, లోకేష్ ను అడుగుతున్నానన్నారు. నేను మాట్లాడిన తప్పుకు పశ్చాతాపం వ్యక్తం చేశానని.. వారికి దేవుడే సమాధానం చెప్తాడని అంబటి రాంబాబు తెలిపారు.

Ambati |

Leave a Reply