Polampalli miseries   పోలంపల్లి కడగండ్లు Andhra Prabha SPL story   

Polampalli miseries   పోలంపల్లి కడగండ్లు Andhra Prabha SPL story   

140 ఏళ్ల అనకట్ట దుస్థితి

సాగునీటికి లభినంచని భరోసా..

  పంటలు మున్నేరు నీటి పాలు

వేసవిలోనూ ఆదుకోని పరిస్థితి…

వైఎస్సార్ హయాంలో ఊరింత

మధ్యలోనే ఆగిపోయిన పనులు…

140 ఏళ్ల అనకట్ట దుస్థితి

సాగునీటికి లభినంచని భరోసా..

  పంటలు మున్నేరు నీటి పాలు

వేసవిలోనూ ఆదుకోని పరిస్థితి…

వైఎస్సార్ హయాంలో ఊరింత

మధ్యలోనే ఆగిపోయిన పనులు…

( ఆంధ్రప్రభ,  ఎన్టీఆర్​ బ్యూరో)

ర్షం వస్తే వరద ముప్పు… ఎండొస్తే నీటి కి కటకట … రెండు కాలాలూ రైతుకే నష్టం ఇది 140 ఏళ్ల  చరిత్ర ఉన్న పోలంపల్లి ఆనకట్ట పరిస్థితి. రెండు తెలుగు రాష్ట్రాలకు అనుసంధానంగా ఉంటూ వేల ఎకరాలకు సాగునీరు ఎన్నో గ్రామాలకు తాగునీరు అందిస్తున్న ఈ ఆనకట్ట నిర్లక్ష్యానికి నిధులలేమికి గురై రైతులకు కడగండ్లను మిగులుస్తోంది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలోని వత్సవాయి మండలం పోల్లంపల్లి గ్రామం వద్ద ఉన్న పోలంపల్లి ఆనకట్టపై ఆధారపడి జీవిస్తున్న రైతుల పరిస్థితి కడు దయనీయంగా మారింది. 140 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆనకట్ట మూడు మండలాలకు జీవనాధారమైనప్పటికీ, సరైన సంరక్షణ, ఆధునీకరణ లేకపోవడంతో రైతులకు భరోసా ఇవ్వలేని స్థితికి చేరింది.

Polampalli miseries

మున్నేరు నది వరదలతో ఒకవైపు పంటలు కొట్టుకుపోతుంటే, మరోవైపు సాగునీరు అందక వేలాది ఎకరాలు ఎండిపోతున్నాయి. ప్రభుత్వాలు మారుతున్న నాయకులు వచ్చి వెళ్తున్న ఆనకట్ట మరమ్మత్తులు కాలువల పూడికి తిత,గండ్లు పోచకపోవడం వంటి వాటిపై దృష్టి సారించిన దాఖలాలు లేవు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్న ఆ ప్రాంత రైతాంగం తక్షణం నిధులు విడుదల చేసి ఆనకట్టకు పునరుద్యోవం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

రైతుల జీవనాధారం  

Polampalli miseries

తెలంగాణా లోని వరంగల్ జిల్లా పానకాల చెరువు నుంచి పుట్టే మున్నేరు నది ఆంధ్ర సరిహద్దులో ప్రవేశించే చోట ఉత్సవాయి మండలం పోలంపల్లిలో ఆనకట్ట నిర్మించబడింది. నాటి బ్రిటిష్ పాలనలోనే ఏర్పాటు చేసిన ఈ ఆనకట్ట అప్పట్లో 16,427 ఎకరాల ఆయకట్టు కోసం నిర్మించారు. తరువాత కాలక్రమంలో పల్లంగిరి ఎక్స్‌టెన్షన్ ఛానల్, 30 కిలోమీటర్ల కాలువల ద్వారా వత్సవాయి, పెనుగంచిప్రోలు, నందిగామ మండలాల్లోని 12 గ్రామాలకు సాగునీరు, తాగునీరు అందించే స్థాయికి ఇది విస్తరించింది. ఈ ప్రాంతంలో వరి, మిర్చి, చెరకు, పత్తి పంటలు పూర్తిగా పోలంపల్లి నీటిపైనే ఆధారపడి ఉన్నాయి. ప్రతి ఏటా వచ్చే నాలుగు నెలల వర్షాలు వరదలలో సుమారు పది టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తూ వృధాగా పోతుంది.

..వైఎస్ హయంలో ఊరింత

Polampalli miseries

నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పోలంపల్లి ఆనకట్టను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలనే ఆలోచన వచ్చింది. 0.85 టీఎంసీల నీటి నిల్వ, రోడ్డు కం బ్రిడ్జి, 20 మీటర్ల ఎత్తు కరకట్టలు,  విస్తరించి దాదాపు 30 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యంగా ప్రణాళిక రూపొందించారు. ప్రారంభంలో రూ 23 కోట్ల అంచనా వేసినప్పటికీ క్రమంగా అది రూ.30 కోట్ల వరకు పనులు జరిగినప్పటికీ, కీలకమైన గేట్లు, రెగ్యులేటర్లు, ఆటోమేషన్ వ్యవస్థలు పూర్తి కాకపోవడంతో ప్రాజెక్టు అర్థాంతరంగా నిలిచిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ రోడ్డు తో పాటు రిజర్వాయర్ను నిర్మించే విధంగా రూపొందించిన ఈ డిజైన్నికి సంబంధించి అతి ముఖ్యమైన 19 కాణాలను ఏర్పాటు చేసినప్పటికీ నీటి ప్రవాహం కోసం ఏర్పాటు చేయాల్సిన గేట్లను ఏర్పాటు చేయలేదు. కాంక్రీట్ డామ్ మ్యారేజి నిర్మాణం దానికనసంధానంగా మట్టికట్టు నిర్మాణం చేసినప్పటికీ గేట్లు అమర్చకుండా వదిలేశారు.

.. అప్పటి టీటీపీ ప్రభుత్వంలో..

Polampalli miseries

 గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హాయంలో కూడా ఈ డ్యాం కోసం ఎమ్మెల్యే శ్రీరామ తాతయ్య ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ మాజీ మంత్రి నెట్టెం రఘురాం ప్రయత్నించారు ఏపీ తెలంగాణకు చెందిన జలవనులలో నిప్పులను తీసుకువచ్చి పరిశీలన చేసి సుమారు 100 కోట్లతో పనులు చేపట్టాలని నిర్ణయించారు అప్పటికే తెలంగాణ విడిపోవడం డ్యాంలో కొంత భాగం నీరు నిల్వ ఉన్న ప్రాంతం తెలంగాణలో ఉండడంతో కొన్ని అడ్డంకులు తెలుత్తాయి ఈలోగా ఎన్నికలు రావడం ప్రభుత్వాలు మారడం కూడా జరిగింది.2012 లో వచ్చిన వరదల కారణంగా డాం మట్టికట్టకు గండిపడడం దానిని పూడ్చేందుకు ఐదు పాయింట్ 25 కోట్లు మంజూరు చేయించారు ఈ పనులు చేపట్టేందుకు తెలంగాణ ప్రాంత రైతుల నుంచి అభ్యంతరాలు రావడంతో నిధులు మంజూరైన పనులు మొదలు పెట్టడం కాలేదు ముందుగా తమ వైపు కరకట్ట నిర్మించి ఆ తర్వాత గండి పోర్చాలని తెలంగాణ రైతుల నుండి విన్నపాలతో పనులు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయాయి.

.. ప్రతి ప్రభుత్వంలోనూ నిర్లక్ష్యమే…

Polampalli miseries

పోలంపల్లి ఆనకట్ట ప్రభుత్వాలు ఎన్ని మారుతున్న నిర్లక్ష్యానికి గురవుతూ ఇదే ఇప్పుడు రైతులకు పెద్ద సమస్యగా మారింది. మున్నేరు నదిలో వరద వస్తే 2 లక్షల క్యూసెక్కుల ప్రవాహం, కానీ కాలువల డిజైన్ సామర్థ్యం మాత్రం 1080 క్యూసెక్కులు మాత్రమే. దీంతో ఎర్త్ డ్యాం గండికొట్టి, తెలంగాణ వైపు గండికోట రైతుల పొలాలు ముంపునకు గురవుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో ఆనకట్ట నిర్మించిన ప్రాంతంలో  మాత్రం నీరు నిల్వ లేక, ఎండాకాలంలో సాగునీరు అందడం లేదు. రైతులు అప్పులు చేసి బోర్లు వేసుకుంటున్నారు, అయినా నీరు దొరకడం లేదు. వర్షం వచ్చినా నష్టం… వర్షం లేకపోయినా నష్టం పోలంపల్లి ఆనకట్ట ఉంటే ఉంది కానీ మాకు ఉపయోగం లేదు అని రైతులు వాపోతున్నా పరిస్థితి నేడు కనబడుతోంది. వైసిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెండింగ్ పనులు పూర్తి కోసం చాలా సార్లు హామీలు ఇచ్చినప్పటికీ అమలులోకి రాలేదు.

.. తాజా అంచనాలతో…

Polampalli miseries

పోలంపల్లి ఆనకట్ట పరిధిలో సాగు చేస్తున్న రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని  దృష్టిలో ఉంచుకుని జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ తాతయ్య ఆనకట్టను తక్షణమే మరమ్మత్తులు చేసి అత్యవసర పనుల కోసం  రాష్ట్ర ప్రభుత్వానికి రూ.21.53 కోట్ల తక్షణ ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనలో ముఖ్యంగా ముంపు పంటలకు నష్టపరిహారం, రీడిజైన్ కోసం 40 ఎకరాల భూసేకరణ (రూ.6 కోట్లు), మిగిలిన నిధులతో తాత్కాలిక మరమ్మత్తులు కాలువ పూడికతీతలు కాలువల మరమ్మత్తులు గండ్లు పూడ్చివేత వంటి పనులు ప్రతిపాదనలో ఉన్నాయి. అయితే రైతు సంఘాలు, సాగునీటి నిపుణుల అంచనా ప్రకారం పోలంపల్లి ఆనకట్టను పూర్తిగా సురక్షితంగా వేల ఎకరాల పొలాలు స్త్రీకరణ చేయాలంటే  రూ.200 కోట్లు ఖర్చు చేసి పూర్తి గా పనులు చేయాల్సిందేనని అప్పుడే 30 వేల ఎకరాలకు సాగునీటి భద్రత, వరద ముప్పు నుంచి రక్షణ సాధ్యమవుతుందని చెబుతున్నారు. అన్ని కాలాలలోనూ ఆ ప్రాంత రైతులకు శాపంగా పరిణమించిన పోలంపల్లి ప్రాజెక్టు పై ఇప్పటి కోటమీ ప్రభుత్వం అయినా శ్రద్ధ పెట్టి తక్షణ నిధులు విడుదల చేసి మరమ్మత్తులు పూర్తి చేసినట్లయితే మూడు మండలాలలోని పంటలు పుష్కలంగా పండే అవకాశం ఉంది.

తక్షణ మరమ్మత్తులు ఎంతో అవసరం..

Polampalli miseries

పోలంపల్లి మున్నేరు డాం కో తక్షణ మరమ్మత్తులు ఎంతో అవసరం. అభివృద్ధికి రూ 21. 50 కోట్ల నిధుల ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందించాము. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది. జలవనరుల శాఖ మంత్రి నీ కలసి మున్నేరు డాం అభివృద్ధి విషయమై వివరించడం జరిగింది. పోలంపల్లి మున్నేరు డాం అభివృద్ధి పునర్నిర్మాణం తదితర అంశాలపై ఇంజనీరింగ్ అధికారులు తో కలసి ఎస్టిమేషన్లు తయారు చేయించడం శాఖ మంత్రి కి అందజేయడంతో పాటు  పూర్తిస్థాయిలో సాగునీరు అందించడానికి అధికారులతో సమీక్ష చేయడం ది. సీఎం చంద్రబాబు వివరించి మున్నేరు డాం అభివృద్ధి చేస్తే సుమారుగా 30 వేల ఎకరాలకు, ప్రత్యక్షంగా ఎన్నో పేర్ల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంది. రైతుల ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి

.శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, శాసనసభ్యుడు, జగ్గయ్యపేట  

Leave a Reply