హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. నేటితో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది.. మొత్తం అయిదు స్థానాలకు అయిదు నామినేషన్ లు దాఖలు కావడంతో ఈ ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగీవ్రమైంది.
కాంగ్రెస్ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ లకు ఎమ్మెల్సీ టికెట్లు కేటాయించగా, బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్, సీపీఐ నుంచి నెల్లికంటి సత్యంలు అభ్యర్థులుగా ఉన్నారు. కాంగ్రెస్, సీపీఐ పొత్తులో భాగంగా ఒక సీటును సీపీఐకి ఇచ్చింది . ఇప్పుడు ఈ అయిదుగురు ఎటువంటి పోటీ లేకుండా ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు..