ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

టేకుమట్ల, ఆంధ్రప్రభ ; భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల కేంద్రంలో మండల బి. ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కెసిఆర్ గారి 72 వ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి, బాణాసంచా కాల్చి ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా మండల పార్టీ అధ్యక్షులు సట్ల రవి , మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఆకునూరి తిరుపతి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా ఉంచారని మళ్ళీ తెలంగాణ లో కెసిఆర్ నాయకత్వం కావాలని కోరుకుంటున్నారని రాబోయే కాలంలో మళ్ళీ తెలంగాణ రాష్ట్రనికి కెసిఆర్ సీఎం అవుతారని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల ముఖ్య నాయకులు బందెల నరేష్, బిళ్ళకంటి ఉమేందర్ రావు, పింగిలి వెంకటేశ్వరరెడ్డి,బొడ్డు సధానందం, కొండ్ర ఓదెలు,టౌన్ అధ్యక్షులు నిమ్మల స్వామి,నల్లబెల్లి రవీందర్, దొడ్ల కోటి, పెరకారి నర్సింగరావు, వెలిశెట్టి సురేష్, బోండ్ల మహేష్,పొన్నం చెంద్రయ్య,ఎంబాడి రాజేందర్, రాజ్ కుమార్, అభి రాజు, జక్కుల కిరణ్, అరుణ్ కుమార్, చెలకాని రాకేష్, సాద మహేందర్,జెట్టి మహేందర్,వర్ధచారి, ఎల్లస్వామీ,పసరగొండ లక్ష్మణ్, ప్రభాకర్ రావు, రాజయ్య, రాజేష్, శ్రీకాంత్, అన్నయ్య, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
