కుర్చీ గుర్తుకు ఓటెయ్యండి.. కౌన్సిలర్ గా గెలిపించండి – మొగుళ్ళ అనురాధ..

కుర్చీ గుర్తుకు ఓటెయ్యండి.. కౌన్సిలర్ గా గెలిపించండి – మొగుళ్ళ అనురాధ..
మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూరు మున్సిపాలిటీలోని 5వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ఒకసారి అవకాశం కల్పించి కౌన్సిలర్ గా గెలిపిస్తే వార్డును అని రంగాల్లో అభివృద్ధిపరుస్తానని 5వ వార్డు స్వతంత్ర అభ్యర్థి మొగుళ్ళ అనురాధ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. గెలుపు మీ వంతు అయితే అభివృద్ధి మా బాధ్యత అంటూ ఓటరులకు చేతులు జోడించి నమస్కరిస్తూ అభ్యర్థిస్తున్నారు.
గత ఎన్నికల్లో తాను కౌన్సిలర్ గా పోటీ చేసి ఓడిపోయానని.. ప్రస్తుత ఎన్నికల్లో వార్డు ప్రజలు తనని గెలిపించి ఒక్కసారి అవకాశం కల్పించాలని.. ప్రజాసేవలో నిమగ్నమై ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజలకు రుణపడి ఉంటానని హామీ ఇస్తున్నారు.
