బీఎస్పీ అభ్యర్థి ఎలగల శ్రీనివాస్ ప్రచారం

బీఎస్పీ అభ్యర్థి ఎలగల శ్రీనివాస్ ప్రచారం
ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 11వ వార్డులో బీఎస్పీ అభ్యర్థి వెలగల శ్రీనివాస్ సోమవారం తన చివరి రోజు ప్రచారంలో భాగంగా ఓటర్లను కలుసుకున్నారు. తన మేనిఫెస్టోలో పొందుపరిచిన ఎనిమిది ప్రధాన హామీలతో ఆయన ప్రచారాన్ని కొనసాగించారు. పార్టీ నేతలు మొరిగాడి శ్రీశైలం గౌడ్, చింతకింది సోమరుషి, ముఖ్యులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
