TG | ఏప్రిల్ 24 నుంచి పాఠ‌శాల‌ల‌కు వేస‌వి సెల‌వులు

హైద‌రాబాద్ – తెలంగాణ ప్ర‌భుత్వం పాఠశాల‌ల‌కు వేస‌వి సెల‌వుల తేదీను ప్ర‌క‌టించింది.. ఈ విద్యా సంవ‌త్స‌రంలో ఆఖ‌రు రోజు ఏప్రిల్ 23 గా నిర్ణ‌యించింది. ఏప్రిల్ 24 నుంచి అన్ని పాఠ‌శాల‌ల‌కు వేస‌వి సెల‌వులని పేర్కొంది.. 23 లోగా అన్ని త‌ర‌గ‌తుల వార్షిక ప‌రీక్ష‌లు పూర్తి చేయాల‌ని విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది. తిరిగి జూన్ మొద‌టి వారంలో కొత్త విద్యా సంవ‌త్స‌రం ప్రారంభం కానుంది..

15 నుంచి ఒంటిపూట బడులు.
ఎండలు మండుతున్నాయి.. రాబోయే రోజుల్లో మరింత టెంపరేచర్ పెరగనుంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ నెల 15వ తేదీ నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలకు ఒంటి పూట బడులు నిర్వహించాలని ఆదేశించింది సర్కార్. టైమింగ్స్ కూడా ప్రకటించింది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు పాఠశాలు ఉంటాయని స్పష్టం చేసింది ప్రభుత్వం.

కాగా, ఇప్పటికే ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. అవి పూర్తి అయిన త‌ర్వాత టెన్త్ ప‌రీక్ష‌లు కొన‌సాగ‌నున్నారు.టెన్త్ పబ్లిక్ పరీక్షలు కొనసాగే బడుల్లో మాత్రం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు నిర్వహించాలని సూచించారు. లాస్ట్ వర్కింగ్ డే ఏప్రిల్ 23 వరకూ హాఫ్ డే స్కూల్స్ కొనసాగనున్నాయి

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *