Narasimhulu l ఆశీర్వదించండి గతంలో కన్న మెరుగైన అభివృద్ధి చేస్తా…

Narasimhulu l ఆశీర్వదించండి గతంలో కన్న మెరుగైన అభివృద్ధి చేస్తా…

18వ డివిజన్‌లో జాజిమొగ్గ నరసింహులు ప్రచార సునామీ

Narasimhulu l మహబూబ్ నగర్, ఆంధ్రప్రభ: మహబూబ్ నగర్ 18వ డివిజన్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి జాజిమొగ్గ నరసింహులు ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేశారు. డివిజన్‌లోని కాలనీ కాలనీ తిరుగుతూ ప్రజలతో నేరుగా మమేకమవుతూ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…గతంలో జరిగిన అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లాలంటే మీ ఆశీర్వాదమే కీలకం.ఈసారి మళ్ళీ అవకాశం ఇస్తే ఎమ్మెల్యే యెన్నం సహకారంతో గతాన్ని మించిన అభివృద్ధిని చేసి చూపిస్తా అని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమంలో ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. అడుగడుగున మహిళలు, యువత, వృద్ధులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నరసింహులుకు మద్దతు ప్రకటించారు. పలు కాలనీల్లో ఆయన చేపట్టిన పాదయాత్ర ఉత్సాహభరితంగా కొనసాగింది. స్థానిక సమస్యలను శ్రద్ధగా విన్న నరసింహులు వాటి పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వ సహకారంతో కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.


డివిజన్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, తాగునీరు, డ్రైనేజీ, రోడ్ల నిర్మాణం, పేదల సంక్షేమం వంటి అంశాలపై స్పష్టమైన కార్యాచరణతో ప్రజల ముందుకు వెళ్లడం కాంగ్రెస్ అభ్యర్థికి బలంగా మారిందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రచార హోరు, ప్రజల నిరాజనం చూస్తుంటే ఈ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply