10వ వార్డులో డీకొండ పద్మ ప్రచార జోరు

గెలుపే లక్ష్యంగా అడుగులు

బెల్లంపల్లి, ఫిబ్రవరి 6 (ఆంధ్రప్రభ): మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెల్లంపల్లి 10వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి డీకొండ పద్మ తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. శుక్రవారం వార్డులోని పలు కాలనీల్లో నిర్వహించిన భారీ ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆమె పాల్గొని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమెకు వార్డు ప్రజలు, ముఖ్యంగా మహిళలు మంగళ హారతులతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా డీకొండ పద్మ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలు ప్రతి పేద కుటుంబానికి ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయని తెలిపారు.

10వ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని, వార్డు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా వార్డులో నెలకొన్న డ్రైనేజీ, మంచినీరు మరియు మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తానని భరోసా ఇచ్చారు. హస్తం గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార ర్యాలీలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండి నయీమ్, సీనియర్ నాయకులు డీకొండ రాజలింగు, కనుకుంట్ల వేణు, టౌన్ యూత్ అధ్యక్షుడు చొప్పరి శ్రీకాంత్, కె. కిరణ్, తాటికొండ రాజగోపాల్, లింగాల రాజశేఖర్, బొజ్జ బాణయ్యలతో పాటు సుమారు 500 మంది మహిళలు , కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Leave a Reply