Telangana | ముగిసిన నామినేష‌న్ ల ప్ర‌క్రియ‌ – నామినేష‌న్ లు దాఖ‌లు చేసిన అయిదుగురు

నామినేష‌న్ లు దాఖ‌లు చేసిన అయిదుగురు
కాంగ్రెస్ త‌రుపును ముగ్గురు, సిపిఐ, బిఆర్ఎస్ నుంచి ఒక్కొక్క‌రు
కాంగ్రెస్ నామినేష‌న్ కార్య‌క్ర‌మానికి రేవంత్, భ‌ట్టి , మ‌హేష్ హాజ‌రు
అంద‌రు అభ్య‌ర్ధులంద‌రూ ఏక‌గీవ్రంగా ఎన్నిక‌య్యే అవ‌కాశం

హైద‌రాబాద్ – ఆంధ్ర‌ప్ర‌భ – తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో జ‌రుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్య‌ర్ధులు నేడు నామినేష‌న్ లు దాఖ‌లు చేశారు. కాంగ్రెస్ అభ్య‌ర్దులుగా అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి, సీపీఐ అభ్యర్థి నెల్లికంటి సత్యం లు త‌మ నామినేష‌న్ ప‌త్రాల‌ను రిట‌ర్నింగ్ అధికారికి అంద‌జేశారు. ఇక ఈ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సీపీఐ నేతలు హాజరయ్యారు. అలాగే ఈ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు పలికింది ఎంఐఎం పార్టీ. ఈ సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లకు మద్దతుగా ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ హాజరయ్యారు. కాంగ్రెస్ నుంచి నలుగురు, బీఆర్‌ఎస్ నుంచి ఒక అభ్యర్థి మాత్రమే పోటీలో ఉండటంతో ఈ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగే అవకాశం కనిపిస్తోంది. బిఆర్ఎస్ త‌మ అభ్య‌ర్ధిగా దాసోజు శ్రావ‌ణ్ కు అవ‌కాశం ఇచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *