Funding | కాలనీలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తా

Funding | కాలనీలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తా
- ఒక్క సారి అవకాశం ఇవ్వండి
- 34 వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి గంజి రాజు
Funding | నిర్మల్ టౌన్, ఆంధ్రప్రభ : ఈనెల 11న జరుగనున్న మున్సిపల్ ఎన్నిక ల్లో ఒక్కసారి 34వ వార్డు కౌన్సిలర్ బీజేపీ పార్టీ అభ్యర్థి గంజి రాజు ఈ రోజు ఇంటింటా ప్రచారం చేపట్టి అవకాశం ఇవ్వాలని ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా గంజి రాజు మాట్లాడు తూ తమకు ఒక్కసారి కౌన్సిలర్ గా అవకాశం కల్పిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని ఓటర్లను ప్రసన్నం చేసుకున్నా రు.
34వ వార్డులో దీర్ఘకాలికంగా నెలకొన్న సమస్యలన్నింటిని మూడు నెల ల్లోనే తెలుసుకుని దశల వారిగా సమస్యలను పరిష్కరించి మీముందుకు వస్తామని ఓటర్లకు భరోసా కల్పించారు. ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సహకారంతో ప్రత్యేకంగా నిధులు తెచ్చేందుకు కృషి చేస్తానని ప్రజలకు భరోసా కల్పించారు. ప్రత్యేక నిధులు తీసుకువచ్చి వార్డు అభివృద్ధికి దోహదపడుతామన్నారు.
వార్డులో నెలకొన్న సమస్య లు ఏవైనా ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వాటిని వెనువెంటనే పరిష్కరించేందుకు పెద్దల సహకారంతో పరిష్కరిస్తామన్నారు. వార్డు ప్రజలు వారికి బ్రహ్మరథం పట్టారు. ఆయన వెంట కాలనీవాసులు, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
