Electricity | విద్యుత్ స్తంభాలను ధ్వంసం చేసిన కేసులో ట్రాక్టర్ సీజ్…

Electricity | విద్యుత్ స్తంభాలను ధ్వంసం చేసిన కేసులో ట్రాక్టర్ సీజ్…

Electricity | జన్నారం, ఆంధ్రప్రభ : మండలంలోని కలమడుగు గ్రామంలో గత నెల 1న విద్యుత్ స్తంభాలను ధ్వంసం చేసిన కేసులో అదే గ్రామానికి చెందిన జక్కుల మధుకర్ ట్రాక్టర్ ను సీజ్ చేసినట్లు స్థానిక ఎస్సై గొల్లపల్లి అనూష మంగళారం సాయంత్రం తెలిపారు.

కలమడుగు గ్రామానికి చెందిన జంగిలి కొమురయ్య, మెరుగు కొండయ్యల గోదావరి సమీపాన ఉన్న వ్యవసాయ భూములలోని 3 విద్యుత్ స్తంభాలను అదే గ్రామానికి చెందిన డ్రైవర్ ఎల్కూసి మహేష్, జక్కుల మధుకర్ ట్రాక్టర్ తో గత నెల 1న గుద్దించి ధ్వంసం చేశాడని స్థానిక విద్యుత్ శాఖ ఏఈ లచ్చన్న ఫిర్యాదు మేరకు మహేష్ పై కేసు నమోదు చేశామన్నారు. ఆ కేసులో భాగంగా మధుకర్ ట్రాక్టర్ ను సీజ్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ఆమె చెప్పారు.

Leave a Reply