HYD | ఎందుకంటే….

HYD | ఎందుకంటే….
HYD | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : పెళ్లి కావడం లేదని యువతి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తల్లికున్న వైకల్యం కారణంగా తనకు పెళ్లి జరగడం లేదని ఓ యువతి తీవ్ర మనోవేదనకు గురైంది. చివరికి హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకుంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్ జిల్లా కండ్లకోయకు చెందిన తోష్నివాల్ విజయలక్ష్మీ(26) కూకట్ పల్లి పరిధిలోని మైత్రినగర్ లో ఉంటోంది. ఆమె తండ్రి చిన్నప్పుడే చనిపోగా.. తల్లి సరస్వతికి మతిస్థిమితం సరిగా లేదు. యువతి ఐటీ సంస్థలో ఉద్యోగం చేస్తుంది. ఇటీవల వివాహ సంబంధాలు రాగా.. మతిస్థిమితం లేని తన తల్లి తనతో పాటే ఉంటుందని విజయలక్ష్మి నిబంధన పెట్టడంతో వారు పెళ్లికి నిరాకరించారు.
దీంతో తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకుంది.
