8th ward | ఒక్క అవకాశం ఇవ్వండి..వార్డు అభివృద్ధి చేస్తా

8th ward | ఒక్క అవకాశం ఇవ్వండి..వార్డు అభివృద్ధి చేస్తా

  • బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పొన్న రాజేష్ పోటీ

8th ward | స్టేషన్‌ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీలోని 8వ వార్డు నుంచి బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా పొన్న రాజేష్ ఎన్నికల బరిలోకి దిగారు. ఆయన మాటలకే పరిమితం కాని వ్యక్తి. ఆప్యాయంగా మెలిగే స్వభావం..అవసరమైతే అన్నగా ముందుండే ధైర్యం ఉంది. రాజకీయ అనుభవంతో పాటు వార్డు సమస్యలపై పూర్తి పట్టు ఉన్న నాయకుడు అని స్థానికులు పేర్కొంటున్నారు. సోమవారం ఉదయం నుంచి అభ్యర్థి వార్డులో ఇంటింటా తిరుగుతూ ఓటర్లను ఆప్యా యంగా కలుస్తూ, తనకు అవ కాశం ఇస్తే వార్డు అభివృద్ధి చేసి చూపిస్తా నని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా పొన్న రాజేష్ మాట్లాడుతూ..ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో వార్డులోని నిరుపేద మహిళలకు 200 కుట్టు మిషన్లు అందిస్తాను. గెలిచిన వెంటనే వాటి మంజూరుకు పూర్తి బాధ్యత తన దేనని తెలిపారు. అలాగే కుల సంఘాలకు కమ్యూనిటీ హాల్ లేని ప్రాంతాల్లో వాటి ఏర్పాటు కోసం కృషి చేస్తానన్నారు. కల్యాణి లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ అవినీతి లేకుండా సహాయం అందేలా చూస్తానని స్పష్టం చేశారు. వార్డులో ప్రధాన సమస్యలైన డ్రైనేజీ సమస్యలు, సీసీ రోడ్ల నిర్మాణం, వీధి దీపాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తానని చెప్పారు.

యువజన సంఘాలకు మరింత సహకారం అందిస్తాను:

ఆపదలో ఉన్న ప్రజల పక్కనే ఉంటాను. క్రీడలకు ప్రోత్సాహం, యువ జన సంఘాలకు సహకారం అందించాను. యువతకు మరింత ప్రోత్సా హం అందిస్తానని రాజేష్ ఈ సందర్భంగా చెప్పారు. తనకు 20 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే వ్యక్తిగా ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. శివాజీ విగ్రహం, పద్మశాలి ఆలయం, అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటుకు తన వంతు సహాయం చేశా నని తెలిపారు. దాబా బంగ్లాలో బతుకమ్మ బొమ్మ ఏర్పాటు పను లు కొన్ని అనివార్య కారణాల వల్ల నిలిచిపోయాయి.

గెలిచిన వెంటనే ఆ పనులను పూర్తి చేసి ఆడపడు చులకు కానుకగా అందిస్తానని హామీ ఇచ్చారు. పెండింగ్‌లో ఉన్న రోడ్లు, డ్రైనేజీ, లైటింగ్ సమస్యల పరిష్కా రంతో పాటు సీసీ కెమెరాల ఏర్పా టు కూడా చేపడతానన్నారు. నాకు తల్లిదండ్రులు కట్టించిన ఇల్లు తప్ప మరో ఆస్తి లేదు. గుంట భూమి కూడా లేదు. నీతి, నిజాయితీతో వార్డును అభి వృద్ధి చేయడమే నా లక్ష్యం. ఒక్క అవకాశం ఇవ్వండి అని ఓటర్లను పొన్న రాజేష్ అభ్యర్థిం చారు.

Leave a Reply