3rd ward | ఒక్కసారి అవకాశం ఇవ్వండి…

3rd ward | నిర్మల్ టౌన్, ఆంధ్రప్రభ : ఈనెల 11న జరుగనున్న మున్సిపల్ ఎన్నిక ల్లో 3వ వార్డు కౌన్సిలర్ బీజేపీ అభ్యర్థి ఈ రోజు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ… తమకు ఒక్కసారి కౌన్సిలర్ గా అవకాశం కల్పిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు. 3వ వార్డులో నెలకొన్న సమస్యలన్నింటిని మూడు నెలల్లోనే తెలుసుకుని దశల వారిగా సమస్యలను పరిష్కరించి మీముందుకు వస్తామని ఓటర్లకు భరోసా కల్పించారు. ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సహకారంతో ప్రత్యేక నిధులు తీసుకువచ్చి వార్డు అభివృద్ధికి దోహదపడుతామన్నారు. వార్డులో నెలకొన్న సమస్య లు ఏవైనా ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వాటిని వెనువెంటనే పరిష్కరించేందుకు ఎమ్మెల్యే సహకారంతో పరిష్కరిస్తామన్నారు. వార్డు ప్రజలు వారికి బ్రహ్మరథం పట్టారు. ఆయన వెంట కాలనీవాసులు, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
