Jukkal | గ్రామ గ్రామాన బీఆర్ఎస్ శ్రేణుల నిరసనలు…

Jukkal | గ్రామ గ్రామాన బీఆర్ఎస్ శ్రేణుల నిరసనలు…
సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనాలు…
Jukkal | జుక్కల్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, రాష్ట్ర సాధన ఉద్యమకారుడు మాజీ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ పై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కక్షపూరిత చర్యలను నిరసిస్తూ జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఆదేశానుసారం జుక్కల్ మండలంలోని మైబాపూర్, చిన్న ఎడ్గి, బస్వాపూర్ గ్రామాలలో బీఆర్ఎస్ శ్రేణులు తమ నిరసన కార్యక్రమాలు, ధర్నాలు, సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనాలను నిర్వహించారు. ఈసందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతగాక, రాష్ట్ర ప్రజలు నిలదీస్తుంటే ప్రజల దృష్టిని మళ్లించేందుకే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సిట్ పోలీసుల ద్వారా నోటీసులు పంపి, విచారణ చేపట్టడం లాంటి నాటకాలకు తెరలేపడం జరిగిందని వారన్నారు.
ఎన్ని కుట్రలు చేసిన ప్రతిపక్షాల గొంతును నొక్కలేరని, ప్రజలను ఇప్పుడు మభ్యపెట్టలేరని, ప్రజలు వారికి తగిన గుణపాఠం చెప్పడం జరుగుతుందని వారన్నారు. బస్వాపూర్ లో వాగ్మరే మొగులాజి, శంకుపాటిల్, కమ్మరి సంజీవ్ కుమార్, సుంకరిబాలాజీ, బీరుగొండ, బాబు, జ్ఞానేశ్వర్, హన్మండ్లు, జైపాల్ పాల్గొనగా, మైబాపూర్ లో పిర్ రెడ్డి, అశోక్, గఫార్, జ్ఞానేశ్వర్, మారుతి, సంజీవ్ కరీం, రాములు, అఫ్జల్ సాయినాథ్, రామ్ రెడ్డి సుధాకర్ పాల్గొన్నారు. చిన్న ఎడ్గిలో శివాజీ పాటిల్, సంతోష్ గొండ, యోగేష్ పటేల్, ప్రశాంత్, శేఖర్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
