Dial100 | చైన్ స్నాచింగ్ ప్రచారంపై సీపీ సజ్జనార్ క్లారిటీ

Dial100 | చైన్ స్నాచింగ్ ప్రచారంపై సీపీ సజ్జనార్ క్లారిటీ

Dial100 | ఆకాశాన్ని తాకుతున్న బంగారం ధరలు – ప్రజల్లో ఆందోళన
చైన్ స్నాచింగ్ లపై సోషల్ మీడియాలో వైరల్ ప్రచారం
అవాస్తవ వార్తలపై హైదరాబాద్ పోలీస్ హెచ్చరిక
నగరం పూర్తిగా సురక్షితం: సీపీ సజ్జనార్ స్పష్టం

Dial100 | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : బంగారానికి రెక్కలు వచ్చాయి.. వెళ్లి ఆకాశంలో కూర్చొంది. అందే వాటికన్నా.. అందని వాటికే ఎక్కువ విలువ కదా.. అందుకే.. అందకుండా ఆకాశంలో కూర్చొన్న బంగారానికి మరింత విలువ పెరిగింది. ఇదే కొంత మందిని ఆలోచనలో పడేసింది. విలువ పెరుగుతుంది కదా.. అని ఇప్పుడే కొనేసుకోవాలని బంగారం పై దృష్టి పెట్టేవారు కొందరైతే.. బంగారం రేటు పెరిగింది కదా.. దొంగలిస్తే.. వాటిని అమ్మేస్తే.. డబ్బులు బాగా వస్తాయి కదా అని ఆలోచించేవారు దొంగలు. దీనిని కొందరు సోషల్ మీడియాలో వేరే రకంగా ప్రచారం చేస్తూ.. తెగ టెన్షన్ పెడుతున్నారు. అయితే.. వైరలైన ఈ ప్రచారం పై సీపీ సజ్జనార్ క్లారిటీ ఇచ్చారు.

Dial100 | వారి పై చట్టపరమైన కఠిన చర్యలు

Dial100
Dial100

|

మేటర్ ఏంటంటే.. రేట్లు పెరగడంతో.. చైన్ స్నాచింగ్ లు విపరీతంగా పెరిగిపోయాయని అంతరాష్ట్ర ముఠాలు హైదరాబాద్ లో మకాం వేసాయని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అయితే.. ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవమని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ అన్నారు. దయచేసి సోషల్ మీడియాలో వచ్చే, ధృవీకరించని వార్తలను భయపెట్టే పోస్టులను ఫార్వార్డ్ చేయకండి.. భయాందోళనలు సృష్టించేలా, మోరల్ దెబ్బ తీసేలా అసత్య ప్రచారాలు చేసే వారి పై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాం. హైదరాబాద్ నగరం పూర్తిగా సురక్షితం. శాంతి భద్రతల పరిరక్షణలో మాకు సహకరించండి.. ఏదైనా అనుమానం వస్తే డయల్ 100 కు కాల్ చేయండి. నిశ్చింతగా ఉండండి.. మీ భద్రతే మా ప్రథమ కర్తవ్యం.. అని సజ్జనార్ ట్విట్టర్ ద్వారా తెలియచేశారు.

click here to read more

click here to read Junk food | ఆర్థిక సర్వే… కీలక సూచనలు

Leave a Reply