IRIA 2026 | నివారణ ఆరోగ్య సంరక్షణకు బలంగా ఫ్యూజీఫిల్మ్ ఇండియా సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలు

IRIA 2026 | నివారణ ఆరోగ్య సంరక్షణకు బలంగా ఫ్యూజీఫిల్మ్ ఇండియా సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలు

IRIA 2026 | నివారణ ఆరోగ్య సంరక్షణకు బలంగా ఫ్యూజీఫిల్మ్ ఇండియా సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలుతక్కువ రేడియేషన్‌తో కచ్చితమైన నిర్ధారణకు ‘FCT iStream’
మహిళల ఆరోగ్యంపై దృష్టితో డిజిటల్ మామోగ్రఫీ ‘Sophinity’
గ్రామీణ–పట్టణ ప్రాంతాలకు అనువైన FDR Smart X Essential ఎక్స్-రే సిస్టమ్స్
‘HCIT Fenix’తో వేగవంతమైన డిజిటల్ హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్
‘Make in India’లో ఫ్యూజీఫిల్మ్ పాత్ర – భారత వైద్య మౌలిక సదుపాయాలకు బలోపేతం

IRIA 2026 | భారతదేశ ‘నివారణ ఆరోగ్య సంరక్షణ’ లక్ష్యానికి మద్దతుగా ఫ్యూజీఫిల్మ్ ఇండియా సరికొత్త సాంకేతికత అధునాతన ఇమేజింగ్ మరియు హెల్త్‌కేర్ ఐటి (IT) పరిష్కారాల ఆవిష్కరణ • ఐఆర్ఐఏ (IRIA) 2026 వేదికగా ‘ఎఫ్‌సిటి ఐస్ట్రీమ్’ (FCT iStream), ‘సోఫినిటీ’ (Sophinity) డిజిటల్ మామోగ్రఫీ, ‘ఎఫ్‌డిఆర్ స్మార్ట్ ఎక్స్ ఎసెన్షియల్’ (FDR Smart X Essential) మరియు ‘హెచ్‌సిఐటి ఫీనిక్స్’ (HCIT Fenix) విడుదల. • పెరుగుతున్న స్కానింగ్ అవసరాలు, సిబ్బంది కొరత మరియు క్లిష్టమైన వ్యాధి నిర్ధారణ సవాళ్లను పరిష్కరించడమే లక్ష్యం. • నాణ్యమైన ఆవిష్కరణలతో భారతదేశ ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంపై ఫ్యూజీఫిల్మ్ ఇండియా నిబద్ధత. హైదరాబాద్, జనవరి 30, 2026: భారతదేశంలో రేడియాలజీ మరియు డయాగ్నోస్టిక్ ఇమేజింగ్ రంగం వృద్ధిలో కొత్త దశలోకి అడుగుపెడుతోంది. ప్రజల ఆయుర్దాయం పెరగడం, ఆరోగ్య స్పృహ మెరుగుపడటం, మరియు ‘ఆయుష్మాన్ భారత్’ వంటి ప్రభుత్వ ఆరోగ్య పథకాల విస్తరణ ఇందుకు ప్రధాన కారణాలు.

IRIA 2026
IRIA 2026

IRIA 2026 | ఫ్యూజీఫిల్మ్ ఇండియా

దీనివల్ల దేశవ్యాప్తంగా సకాలంలో, కచ్చితమైన మరియు అందరికీ అందుబాటులో ఉండే డయాగ్నోస్టిక్స్ అవసరం ఎంతగానో పెరిగింది. ముఖ్యంగా క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల చికిత్సలోనూ, ముందస్తు ఆరోగ్య పరీక్షలలోనూ స్కానింగ్ కీలకం కావడంతో… మెట్రో నగరాలకే పరిమితం కాకుండా, చిన్న పట్టణాల్లోనూ నాణ్యమైన వైద్యసేవలను అందించగల అధునాతన సాంకేతికత అవసరం ఏర్పడింది. ఈ మారుతున్న అవసరాలకు తగ్గట్టుగా, డయాగ్నోస్టిక్ ఇమేజింగ్ రంగంలో అగ్రగామి అయిన ఫ్యూజీఫిల్మ్ ఇండియా (FUJIFILM India), ఈరోజు హైదరాబాద్‌లో జరుగుతున్న ‘ఇండియన్ రేడియాలజికల్ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్’ (IRIA 2026) సదస్సులో నాలుగు అత్యాధునిక ఇమేజింగ్ మరియు హెల్త్‌కేర్ ఐటి పరిష్కారాలను ఆవిష్కరించింది.

IRIA 2026 | ఫ్యూజీఫిల్మ్ వారి సరికొత్త సిటి స్కాన్ వ్యవస్థ

ఎలాంటి ఆసుపత్రి వాతావరణంలోనైనా కచ్చితమైన వ్యాధి నిర్ధారణ, వేగవంతమైన పనితీరు మరియు సేవలను విస్తృతం చేసే సాంకేతికతల ద్వారా… భారతదేశ డయాగ్నోస్టిక్ రంగాన్ని బలోపేతం చేయాలనే సంకల్పాన్ని కంపెనీ చాటిచెప్పింది. ఈ ఆవిష్కరణలలో ప్రధానమైనది ‘ఎఫ్‌సిటి ఐస్ట్రీమ్’ (FCT iStream). ఇది “తక్కువలో ఎక్కువ” అనే డిజైన్ సూత్రంతో రూపొందించిన ఫ్యూజీఫిల్మ్ వారి సరికొత్త సిటి స్కాన్ వ్యవస్థ. ఎఫ్‌సిటి ఐస్ట్రీమ్… హై-డెఫినిషన్ ఇమేజింగ్‌ను, తక్కువ రేడియేషన్ డోస్‌ను మరియు ‘సినర్జీ-డ్రైవ్’ (SynergyDrive), ‘REiLI’ అనే మెడికల్ ఏఐ (AI) టెక్నాలజీలతో కూడిన ఆటోమేషన్‌ను మిళితం చేస్తుంది. రోగిని స్కానర్ పై పడుకోబెట్టడం దగ్గరి నుంచి స్కాన్ ప్లానింగ్, ఇమేజ్ రీకన్‌స్ట్రక్షన్ వరకు… స్కానింగ్ ప్రక్రియలోని కీలక దశలన్నింటినీ ఇది ఆటోమేట్ చేస్తుంది. ఇది ‘సినాప్స్ 3డి వర్క్‌స్టేషన్’తో అనుసంధానించబడి, శరీరాంతర్గత భాగాలను స్పష్టంగా చూపిస్తుంది.

దీనివల్ల రేడియాలజీ విభాగాలు పెరుగుతున్న రోగుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించగలుగుతాయి. ఇందులోని అధునాతన టెక్నాలజీలు… గుండె, మెదడు, క్యాన్సర్, ప్రమాదాలు మరియు నివారణ ఆరోగ్య పరీక్షల్లో అతి తక్కువ రేడియేషన్‌తోనే కచ్చితమైన ఫలితాలను అందిస్తాయి. సిటి స్కాన్లతో పాటు, ఫ్యూజీఫిల్మ్ ఇండియా మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ‘అమ్యూలెట్ సోఫినిటీ’ (AMULET SOPHINITY) అనే అధునాతన డిజిటల్ మామోగ్రఫీ వ్యవస్థను ప్రవేశపెట్టింది. రొమ్ము క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. రోగికి సౌకర్యంగా ఉండేలా, కచ్చితమైన ఫలితాలు వచ్చేలా దీనిని రూపొందించారు.

హై-రిజల్యూషన్ ఇమేజింగ్, ఏఐ సహాయంతో పొజిషనింగ్, టోమోసింథసిస్ (Tomosynthesis) వంటి ఫీచర్ల ద్వారా ఇది పనిచేస్తుంది. మహిళల ఆరోగ్యంలో ముందస్తు జాగ్రత్తలు మరియు మెరుగైన స్క్రీనింగ్ ఫలితాలపై ఫ్యూజీఫిల్మ్ ఇండియాకున్న శ్రద్ధకు ఇది నిదర్శనం. ఈ కొత్త ఉత్పత్తుల జాబితాలో డిజిటల్ రేడియోగ్రఫీ (ఎక్స్-రే) వ్యవస్థలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు ‘ఎఫ్‌డిఆర్ స్మార్ట్ ఎక్స్ ఎసెన్షియల్’ (FDR Smart X Essential) సిరీస్. నిత్యం రద్దీగా ఉండే ఆసుపత్రులు మరియు స్కానింగ్ సెంటర్ల కోసం వీటిని ప్రత్యేకంగా రూపొందించారు. పెద్ద ఆసుపత్రుల నుండి చిన్న డయాగ్నోస్టిక్ సెంటర్ల వరకు… తక్కువ స్థలంలోనే ఎక్కువ పనితనాన్ని ఇచ్చేలా ఇవి ఉంటాయి.

ఈ ఎక్స్-రే వ్యవస్థలు తక్కువ జాగాను ఆక్రమిస్తూనే, నాణ్యమైన ఎక్స్-రేలను అందిస్తాయి మరియు పనిని సులభతరం చేస్తాయి. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఎక్స్-రే సేవలను విస్తృతం చేయడానికి ఇవి దోహదపడతాయి. ఇందులో అవసరాన్ని బట్టి ఏఐ (AI) సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ ఇమేజింగ్ పరికరాలకు వెన్నెముకగా ఫ్యూజీఫిల్మ్ వారి హెల్త్‌కేర్ ఐటి వ్యవస్థ నిలుస్తుంది. ఇందులో ‘హెచ్‌సిఐటి ఫీనిక్స్’ (HCIT Fenix) వంటి ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి. ఇవి స్కాన్ రిపోర్టులను భద్రపరచడం, ఒక చోట నుంచి మరొక చోట ఉన్న డాక్టర్లకు పంపించడం మరియు వివిధ ఆసుపత్రుల మధ్య సమాచార మార్పిడిని సులభతరం చేస్తాయి.

ఇమేజింగ్ పరికరాలను తెలివైన సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానించడం ద్వారా… డాక్టర్లు వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి మరియు ఆసుపత్రి కార్యకలాపాలను మెరుగుపరచడానికి ఫ్యూజీఫిల్మ్ ఇండియా కృషి చేస్తోంది. ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా ఫ్యూజీఫిల్మ్ ఇండియా అభివృద్ధి చేసిన ‘ఫెనిక్స్’ (FENIX)… పీఏసిఎస్ (PACS), ఆర్ఐఎస్ (RIS) వంటి వ్యవస్థలను ఒకే వేదికపైకి తెస్తుంది. భారతదేశంలోని రేడియాలజీ విభాగాల అవసరాలకు తగ్గట్టుగా దీనిని తీర్చిదిద్దారు. ఇది వాడుకలో చాలా సులభంగా ఉంటూ, వేగవంతమైన రోగ నిర్ధారణకు సహకరిస్తుంది. ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు మరియు టెలి-రేడియాలజీ నెట్‌వర్క్‌లలో దీనిని సులభంగా ఏర్పాటు చేసుకోవచ్చు. స్థానికంగా అభివృద్ధి చేసిన ఆవిష్కరణల ద్వారా వైద్యులకు అండగా నిలవాలనే ఫ్యూజీఫిల్మ్ ఇండియా లక్ష్యానికి ఇది అద్దం పడుతుంది. ఐఆర్ఐఏ (IRIA) 2026లో ప్రదర్శనపై స్పందిస్తూ, ఫ్యూజీఫిల్మ్ కార్పొరేషన్ (మెడికల్ సిస్టమ్స్ బిజినెస్ – మోడాలిటీ సిస్టమ్స్ డివిజన్) జనరల్ మేనేజర్ శ్రీ నోబువో మత్సునోబే మాట్లాడుతూ, “ఫ్యూజీఫిల్మ్ హెల్త్‌కేర్ ఆవిష్కరణలు ప్రధానంగా ఇమేజ్ క్వాలిటీ, డోస్ ఆప్టిమైజేషన్ (రేడియేషన్ మోతాదు నియంత్రణ) మరియు అన్ని విభాగాల్లో వర్క్‌ఫ్లో ఆటోమేషన్‌పైనే దృష్టి సారిస్తాయి.

ఎఫ్‌సిటి ఐస్ట్రీమ్ (FCT iStream), అములెట్ సోఫినిటీ (AMULET SOPHINITY), ఎఫ్‌డిఆర్ స్మార్ట్ ఎక్స్ ఎసెన్షియల్ (FDR Smart X Essential), ఏరియెట్టా 750 డీప్‌ఇన్‌సైట్ (ARIETTA 750 DeepInsight) మరియు మా హెల్త్‌కేర్ ఐటి ప్లాట్‌ఫామ్‌లతో సహా ఐఆర్ఐఏ 2026లో ప్రదర్శించిన పరిష్కారాలన్నీ మా ప్రత్యేక విధానాన్ని ప్రతిబింబిస్తాయి. పెరుగుతున్న ఇమేజింగ్ వాల్యూమ్‌లను (స్కానింగ్ అవసరాలను) పరిష్కరించడానికి, నిర్వహణ సామర్థ్యాన్ని ఆప్టిమైజ్ చేయడానికి మరియు డయాగ్నోస్టిక్ విశ్వాసాన్ని పెంచడానికి… మేము ఏఐ-ఎనేబుల్డ్ టెక్నాలజీలను క్లినిషియన్-సెంట్రిక్ (వైద్యులకు అనుకూలమైన) డిజైన్‌తో మిళితం చేస్తున్నాము.

ప్రపంచ స్థాయి నాణ్యత, విశ్వసనీయత ప్రమాణాలకు అనుగుణంగా ఉంటూనే, విభిన్న క్లినికల్ వాతావరణాలలో ఈ సాంకేతికతలు నిలకడగా పనిచేసేలా రూపొందించబడ్డాయి,” అని అన్నారు. దీనికి జతచేస్తూ, ఫ్యూజీఫిల్మ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కోజీ వాడా మాట్లాడుతూ, “భారతదేశంలో డయాగ్నోస్టిక్ అవసరాలు వేగంగా మారుతున్నాయి. కచ్చితత్వం, వేగం మరియు అన్ని ప్రాంతాల్లోనూ వైద్య సేవలు అందుబాటులో ఉండాలనే డిమాండ్ పెరుగుతోంది. అధునాతనమైనప్పటికీ ఆచరణాత్మకమైన మా ఇమేజింగ్ మరియు ఐటి పరిష్కారాలతో… భారతదేశ వైద్య రంగానికి మద్దతు ఇవ్వడం ద్వారా ‘ప్రపంచానికి మరిన్ని చిరునవ్వులను అందించడం’ అనే మా లక్ష్యాన్ని నెరవేర్చుకుంటున్నాము. ప్రపంచాన్ని మార్చడానికి మా విభిన్న ఆలోచనలను, సామర్థ్యాలను ఏకతాటిపైకి తెస్తూ… ఇక్కడి డయాగ్నోస్టిక్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంపై మేము దృష్టి సారించాము,” అని పేర్కొన్నారు.

ఐఆర్ఐఏ 2026లో తన విస్తృత శ్రేణి ఉత్పత్తులతో, ఫ్యూజీఫిల్మ్ ఇండియా విశ్వసనీయ హెల్త్‌కేర్ టెక్నాలజీ భాగస్వామిగా తన స్థానాన్ని పదిలం చేసుకుంది. సిటి (CT), మామోగ్రఫీ, ఎక్స్-రే, అల్ట్రాసౌండ్ మరియు హెల్త్‌కేర్ ఐటి వంటి అన్ని విభాగాల్లోనూ సమగ్ర పరిష్కారాలను అందిస్తోంది. సకాలంలో రోగ నిర్ధారణ, మెరుగైన చికిత్స ఫలితాలు మరియు మారుతున్న ఆరోగ్య అవసరాలకు మద్దతు ఇవ్వడానికి… కంపెనీ ఏఐ (AI), ఆటోమేషన్, నివారణ ఆరోగ్యం మరియు వైద్యుల శిక్షణపై దృష్టి సారిస్తూ, హెల్త్‌కేర్ సంస్థలతో కలిసి పనిచేస్తోంది.

click here to read more

click here to read 24k gold | ధరలు రికార్డు స్థాయిలో.. ఇప్పుడే కొనాలా? పెళ్లిళ్ల సీజన్ ముందు నిపుణుల కీలక విశ్లేషణ

Leave a Reply