Utkoor | ఉత్తమ ఎస్ఐని సన్మానించిన సర్పంచ్

Utkoor | ఉత్తమ ఎస్ఐని సన్మానించిన సర్పంచ్

Utkoor | ఊట్కూర్, ఆంధ్రప్రభ : భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని కలెక్టర్, ఎస్పీ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్న నారాయణపేట జిల్లా ఊట్కూర్ ఎస్సైరమేష్, కానిస్టేబుల్ చెన్నరాయుడును పెద్ద జట్రం సర్పంచ్ వాకిటి వెంకటేష్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా పెద్దజట్రంసర్పంచ్ వెంకటేష్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి ఏడాది ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులను గుర్తించి ప్రశంసపత్రం అందజేయగా ఊట్కూర్ పోలీస్ స్టేషన్ నుండి ఎస్సై కానిస్టేబుల్ ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి జిల్లా అధికారుల ప్రజల మన్ననలు పొందారనిఅన్నారు. ఈ సందర్భంగా ఎస్సై రమేష్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కలెక్టర్ ఎస్పీ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకోవడం సంతోషంగా ఉందని ఆనందంగాఉందనిఅన్నారు. ప్రశంస పత్రాలు ఉద్యోగుల్లో నూతన ఉత్సాహంతో పాటు బాధ్యత మరింత పెంచుతుందని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కిరణ్ కుమార్,కుర్వసంఘం ఉపాధ్యక్షులు జల్లప్ప తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply