Canal | రెండు మృతదేహాలు లభ్యం

Canal | రెండు మృతదేహాలు లభ్యం

Canal | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. జిల్లాలోని సైదాపూర్ మండలంలోని సోమారం శివారులోని కాకతీయ కాలువలో ఎస్కేప్ వద్ద ఒక మృతదేహం, వెన్నంపల్లి శివారులో మరో యువకుడి మృతదేహం లభ్యమయ్యాయి.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శంకరపట్నం మండలం కరీంపేట గ్రామానికి చెందిన సాదుల అనిల్ ఈనెల 25న ప్రమాదవశాత్తు కాకతీయ కాలువలో పడి గల్లంతైన విషయం తెలిసిందే. కాగా మృతదేహం కోసం గ్రామస్తులు, కుటుంబ సభ్యులు గాలిస్తుండగా సోమారం ఎస్కేప్ వద్ద చిగురుమామిడి మండలం నవాబుపేట గ్రామానికి కెక్కర్ల వివేక్ మృతదేహం లభ్యమైంది.

దీంతో కరీంపేట గ్రామస్తులు లభ్యమైన మృతదేహం తమది కాదని కాల్వ గట్టుపై వదిలేసి, కరీంపేట గ్రామానికి చెందిన యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కొద్ది దూరంలోని వెన్నంపల్లి శివారులో కరీంపేట గ్రామానికి చెందిన సాధుల అనిల్(23) మృతదేహం లభ్యం కావడంతో రెండు మృతదేహాలు పోస్టుమార్టం నిమిత్తం హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply