Rajasthan | ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు స్పాట్ డెడ్

Rajasthan | ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు స్పాట్ డెడ్

Rajasthan | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : రోడ్డుప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డ ఘటన రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ఇవాళ ఉదయం జరిగింది. వివరాలిలా ఉన్నాయి… నోయిడాకు చెందిన ఒక కుటుంబం ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై కారులో వెళ్తుండగా… దౌసా సమీపంలోని బాండికుయ్ వద్దకు రాగానే ముందు వెళ్తున్న ట్రక్కును బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో కారు ట్రక్కు కిందకు దూసుకెళ్లడంతో సుమారు 200 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. ఈ దుర్ఘటనలో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మరణించారు. మృతులంతా ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా నివాసితులుగా గుర్తించారు.

Leave a Reply