Little Hans | లక్ష్యంతో ఉన్నత శిఖరాలను అధిగమించాలి

Little Hans | లక్ష్యంతో ఉన్నత శిఖరాలను అధిగమించాలి
- ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
Little Hans | జన్నారం రూరల్, ఆంధ్రప్రభ : విద్యార్థులు పట్టుదల లక్ష్యంతో చదువుకొని ఉన్నత శిఖరాలను అధిగమించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని రాఘవేంద్ర లిటిల్ హాన్స్ లో శ్రీ కృష్ణవేణి పాఠశాల ఆధ్వర్యంలో పైడిపల్లి గార్డెన్ లో ఈ రోజు మధ్యాహ్నం ఏర్పాటు చేసిన సమావేశాలకు ఆయన ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. విద్యార్థులు ఇష్టపడి చదువుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ఫీజులతో ఇంగ్లీష్ మీడియం స్కూళ్లను నడుపుతూ, కార్పొరేట్ పాఠశాలకు దీటుగా విద్యార్థులను తయారు చేస్తున్న యజమాన్యాల తీరు అభినందనీయమని ఆయన తెలిపారు. విజేతలకు ఎమ్మెల్యే షీల్డ్ లను అందజేశారు.
ఈ కార్యక్రమంలో చైర్మన్ ఎర్ర చంద్రశేఖర్, కరస్పాండెంట్ ఎర్ర సంపత్, ప్రిన్సిపాల్ ఏదులపురం శ్రీనివాస్, పైడిపల్లి గార్డెన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కృష్ణవేణి ప్రిన్సిపాల్ కస్తూరి సతీష్ కుమార్, ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు జక్కు భూమేష్, వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్, వైస్ చైర్మన్లు లక్ష్మీనారాయణ, ఫసిహుల్ల,కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముజఫర్, తదితరులు పాల్గొన్నారు.
